Barbie: బార్బీలా ఉన్నావని మహిళా క్రికెటర్‌కి రిపోర్టర్ పొగడ్త, కానీ...

Barbie: బార్బీలా ఉన్నావని మహిళా క్రికెటర్‌కి రిపోర్టర్ పొగడ్త, కానీ...
మహిళల 100 బాల్స్‌ సిరీస్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

మార్గరేట్ ర్యాబీ నటించిన బార్బీ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అయితే బ్రిటీష్ టీవీ బీబీసీ స్పోర్ట్స్ వాఖ్యాత క్రిస్ హ్యుస్ ఒక మహిళా క్రికెటర్‌ని బార్బీ అనడంతో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ మైట్లాన్ బ్రౌన్‌ని ఇంటర్వ్యూ చేస్తుండగా మీరు బార్బీలా ఉన్నారని కామెంట్ చేయడంతో వివాదం చెలరేగింది. అయితే ఈ విధంగా మాట్లాడటం సరికాదని పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళల 100 బాల్స్‌ సిరీస్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఆగస్ట్ 1న సదరన్ బ్రేవ్స్ మరియు ట్రెంట్ రాకెట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో, లవ్ ఐలాండ్ మాజీ పోటీదారైన హ్యూస్, బ్రౌన్‌ని "నీలి కళ్లతో ఉన్న చిన్న బార్బీ" అని పిలిచాడు. వారిద్దరి మధ్య సరదా సంభాషణే అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్‌తోనే 2023 సీజన్ 100 బాల్స్ మహిళల క్రికెట్ సిరీస్‌ ఆరంభమైంది. ఇటువంటి వాఖ్యలు సెక్సిస్ట్‌గా వర్ణిస్తున్నారు. ఇవి తగవని విమర్శిస్తున్నారు.




ఈ వ్యాఖ్యకు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలోని స్పోర్ట్స్ రిపోర్టింగ్‌లో సెక్సిజానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శిస్తున్నారు. బీబీసీ ప్రతినిధులు ఈ అంశంపై సదరు వ్యాఖ్యాతతో మాట్లాడినట్లు వెల్లడించారు.

"మేం క్రిస్‌తో మాట్లాడాము, నీ వ్యాఖ్యలు సరికాదని కూడా వెల్లడించాము" అని బీబీసీ ప్రతినిధులు వెల్లడించారు. ఇటువంటి సంఘటనే 2016లో జరిగింది. ప్రత్యక్ష ప్రసారంలో విండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్, రిపోర్టర్ మెల్ మెక్‌లాలిన్‌ని తాగడానికి వెళదామా అని అడిగాడు. దీంతో గేల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 10000 వేల డాలర్ల జరిమానా విధించింది.

ఇటువంటి ఘనటలు స్పోర్ట్స్ ప్రసారాల్లో సెక్సిజం ఘటనలను ఎత్తిచూపుతోంది. లింగ బేధం లేకుండా ఇంటర్వ్యూలు జరిగాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తోంది. క్రీడాకారులు లేదా క్రీడాకారిణులు తమ జెండర్‌ మీద కాకుండా తమ ప్రతిభ, నైపుణ్యాలతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వివక్ష లేని స్పోర్స్ట్ జర్నలిజం దిశగా సాగే యత్నాలకు ఇటువంటి సంఘటనలు ఆటంకాలు ఏర్పరుస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Tags

Read MoreRead Less
Next Story