BCCI : చేతన్ శర్మ రాజీనామా

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్ లో చేసిన వ్యాఖ్యలు వివాదం రేపడంతో... వేటు తప్పదనుకున్న శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషాకు రాజీనామా పంపారు. స్ట్రింగ్ ఆపరేషన్ లో టీమిండియా క్రికెటర్ల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తీవ్ర దుమారం రేగడంతో రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్ లో... గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యతో పాలు పలువురు ఆటగాళ్ల గురించి విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య ఈగో క్లాషెస్ ఉండేవని చేతన్ శర్మ ఆరోపించారు. ఆటగాళ్లు 80 శాతం ఫిట్ గా ఉన్నా కీలకమైన మ్యాచ్ లకు ముందు ఇంజక్షన్లు తీసుకుంటున్నారని అన్నారు. టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని వాటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తారని అన్నారు. ఈ దేశం ఎంతో మంది క్రికెటర్లను చూసిందని, ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్లారని అన్నారు. కొందరైతే తాము లేదనిదే భారత క్రికెట్ కు భవిష్యత్తు లేదన్నట్లు వ్యవహరిస్తారని అన్నారు చేతన్ శర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com