BCCI : సాహో పై బెదిరింపులు.. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కి షాకిచ్చిన బీసీసీఐ ..!

BCCI : భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరింపులకు గురిచేసిన జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రెండేళ్లపాటు నిషేధించింది. బీసీసీఐ ఆదేశాల ప్రకారం.. మజుందార్ రెండేళ్లపాటు భారత్‌లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి కవరేజీ, అక్రిడేషన్ పొందడంపై నిషేధం విధించింది.
అంతేకాకుండా బీసీసీఐతో కాంట్రక్ట్‌తో ఉన్న ఏ అటగాడిని కూడా ఇంటర్వ్యూ చేయకూడదు. బీసీసీఐ, అసోసియేషన్ సభ్యుల నుంచి క్రికెట్‌కు సంబంధించి ఎటువంటి సదుపాయాలను పొందడానికి వీలులేదు. బోరియా మజుందార్ పై ఈ ఆంక్షలు పాటించేలా చూడాలని బీసీసీఐ పలు రాష్ట్రల క్రికెట్ అసోసియేషన్ లను కోరింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తనకి ఇంటర్వ్యూ ఇవ్వనందుకు బోరియా మజుందార్ తనను బెదిరించాడని వృద్ధిమాన్ సాహా గత ఫిబ్రవరిలో ఆరోపణలు చేశాడు. దీనిపైన దర్యాప్తు చేసేందుకు భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, కౌన్సిలర్ ప్రభతేజ్ సింగ్ భాటియాతో కూడిన 3 సభ్యుల కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దర్యాప్తు అనంతరం బీసీసీఐ అతడి పై చర్యలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com