BCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ తెగతెంపులు

భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11, టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందం నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. రూ. 358 కోట్ల భారీ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నప్పటికీ, బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ గేమింగ్ చట్టమే ఈ అనూహ్య పరిణామాలకు దారితీసింది. డ్రీమ్ ఎలెవెన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత, బీసీసీఐ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ, ఇకపై అలాంటి కంపెనీలతో తాము ఎటువంటి ఒప్పందాలు చేసుకోమని అన్నారు. డ్రీమ్ ఎలెవన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ, ‘భవిష్యత్తులో మేం ఇలాంటి కంపెనీలతో పని చేయం’ అని అన్నారు.
డ్రీమ్ 11 కీలక నిర్ణయం..
డ్రీమ్11, భారత క్రికెట్ నియంత్రణ మండలి 2023 సంవత్సరంలో అనుబంధించబడ్డాయి. రెండింటి మధ్య ఒప్పందం 2026 సంవత్సరం వరకు ఉంది. డ్రీమ్11 2026 నాటికి బీసీసీఐకి రూ.358 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఒప్పందం మధ్యలో విచ్ఛిన్నమైంది. దీని కారణంగా బీసీసీఐ కూడా భారీగా నష్టపోయింది. ఆసియా కప్‌నకు ముందు BCCIతో ఏ కంపెనీ చేతులు కలుపుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. బీసీసీఐకి My11Circleతో కూడా సంబంధం ఉంది. ఈ కంపెనీ IPLలో ఫాంటసీ భాగస్వామి. ఈ కంపెనీ ఒక సంవత్సరంలో బీసీసీఐకి భారీ మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. నివేదికల ప్రకారం, My11Circle BCCIకి ఏటా రూ.125 కోట్లు చెల్లిస్తుంది.
జరిమానా లేకుండానే..
ఒకవేళ ఏదైనా కొత్త చట్టం వల్ల కంపెనీ ప్రధాన వ్యాపారానికి ఆటంకం కలిగితే, ఎలాంటి జరిమానా లేకుండా స్పాన్సర్షిప్ నుంచి వైదొలగేందుకు డ్రీమ్ 11కు వెసులుబాటు ఉంది. ఈ క్లాజ్ కారణంగానే, ఒప్పందాన్ని ముందుగా రద్దు చేసినందుకు బీసీసీఐకి వారు ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. 2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ తాజా పరిణామం కేవలం బీసీసీఐపైనే కాకుండా, క్రికెట్ ప్రపంచంపై కూడా ప్రభావం చూపనుంది. డ్రీమ్ 11 ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలతో పాటు, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనేక మంది స్టార్ క్రికెటర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దేశంలో అమల్లోకి వచ్చిన ఆన్లైన్ గేమింగ్ చట్టం డ్రీమ్ 11 వ్యాపారానికి గట్టి దెబ్బ కొట్టింది. ఫలితంగా సంస్థ తన సేవలలో చాలా వరకు నిలిపివేయాల్సి వచ్చింది. దీనివల్ల సహజంగానే స్పాన్సర్షిప్ ఒప్పందాలను కూడా ముగించక తప్పలేదు. పార్లమెంట్ ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు, 2025 ను ఆమోదించింది. దీని ద్వారా రియల్ మనీ గేమింగ్ ప్లాట్ ఫారాలు బ్యాన్ అవుతాయి. డ్రీమ్ 11 వంటి చాలా యాప్స్, కంపెనీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్రముఖ క్రికెటర్లు ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com