BCCI: నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ బిగ్ ప్లాన్

ఆసియా కప్ ఫైనల్లో పాక్‌పై అద్భుత విజయం సాధించిన భారత్‌కు ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేసిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అతడి చేతులమీదుగా ట్రోఫీని తీసుకొనేందుకు భారత్ అంగీకరించలేదు. యూఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి తీసుకుంటామని తెలిపింది. అయినా సరే మోసిన్ మొండిపట్టుతో వివాదాస్పదంగా మార్చేశారు. దీనిపై బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పినా ట్రోఫీ మాత్రం ఇంకా అప్పగించలేదు. బీసీసీఐ లేదా టీమ్ఇండియా కెప్టెన్ నేరుగా తన వద్దకే వచ్చి ట్రోఫీని తీసుకోవాలనేది అతడి పన్నాగం. కానీ, అది జరిగేలా లేదు. ఈ క్రమంలో క్రికెట్ వర్గాల్లో మరో వార్త వైరల్‌గా మారింది. అసలు నఖ్వీని అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచే తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కౌంటర్ ఇచ్చిన సైకియా
ఆసియా కప్ ఏమీ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గట్టి కౌంటర్ ఇచ్చారు. అయినా పీసీబీ చీఫ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాజకీయపరమైన ప్రకటనలు కూడా చేయడం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. భారత్ - పాక్ మ్యాచ్‌ల సమయంలో మాత్రం ఆ రెండింటిని వేర్వేరుగా చూడాలని నీతులు చెప్పిన నఖ్వీపై విమర్శలు వచ్చాయి. దీంతో బీసీసీఐ ముమ్మరంగా ఆయనపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసిందని పీటీఐ చెబుతోంది. ‘‘పాక్ క్రికెట్ బోర్డు, నఖ్వీ మున్ముందు ఎలా ప్రవర్తిస్తుందనేది చూడాలి. ట్రోఫీని తనవద్దే ఉంచుకొని.. భారత్‌కు అప్పగించనని చెప్పే హక్కు నఖ్వీకి లేదు. ఆసియా కప్ టోర్నీకి పాక్ అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. విజేతగా నిలిచిన టీమ్‌కు ట్రోఫీని ఇవ్వాల్సిందేనని బీసీసీఐ స్పష్టంగా చెప్పింది. నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం కఠిన చర్యలకు భారత బోర్డు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదు’’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. అక్కడినుంచి కదిలించకూడదని నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సమావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంకెంతకు దిగజారుతావు?
తన చేతుల మీదగానే ట్రోఫీ ప్రధానం చేయాలని మొండిపట్టుతో ఉన్నాడంట. కాగా ఆసియాకప్ ఫైనల్లో విజయం తర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏసీసీ చైర్మెన్ ఎవరంటే వారే ట్రోఫీని విజేతకు అందించాలి. కానీ నఖ్వీ ఏసీసీ చీఫ్‌తో పాటు పీసీబీ చైర్మెన్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరిచింది. అతడికి బదులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌ల చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని భారత్ తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే తన నుంచే తీసుకోవాలని పట్టుబట్టాడు. టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్‌లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవమానంగా భావించిన నఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్నర్స్ మెడల్స్‌ను తీసుకువెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు నఖ్వీ అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా నఖ్వీ వద్దే ఉంది. "ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. అక్కడి అధికారులకు మొహ్సిన్ నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని అతడు సూచించాడు. ఎప్పుడైనా కానీ భారత జట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ తనే అందజేస్తానని ఏసీసీ అధికారులకు నఖ్వీ చెప్పినట్లు" పీసీబీ చీఫ్ సన్నిహితుడు ఒకరు పిటిఐకు తెలిపారు. నఖ్వీపై గట్టి చర్యలు తీసుకుని నఖ్వీకి, పాక్‌కు షాక్ ఇవ్వాలని బీసీసీఐ చూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com