BCCI: ఏ ప్లస్ గ్రేడ్‌లోనే విరాట్, రోహిత్

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ప్రకటించింది. C గ్రేడ్‌లో.. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా ఉన్నారు. A+లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు బుమ్రా, జడేజా కొనసాగుతున్నారు. A గ్రేడ్‌లో మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రిషభ్ పంత్.. B గ్రేడ్‌లో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ ఉన్నారు. బీసీసీఐ ఏ+ కాంట్రాక్ట్ ప్లేయర్లు రూ.7 కోట్లు, గ్రూప్ ఎ ప్లేయర్లు రూ.5 కోట్లు, బీ కేటగిరీ క్రికెటర్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ప్లేయర్లు రూ.1కోటి శాలరీ రూపంలో అందుకోనున్నారు.
రోహిత్ రికార్డును సమం చేసిన విరాట్
ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును కింగ్ కోహ్లీ సమం చేశాడు. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ 19వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా IPLలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్(25) పేరిట ఉంది. ABD తర్వాత క్రిస్ గేల్ (22) ఉన్నాడు
చెన్నైకి ప్లే ఆఫ్స్ ఛాన్స్.. ఇలా జరిగితేనే..
ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన CSK రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో టాప్ -4లో నిలిచేందుకు అవకాశాలుంటాయి. ఇందులో ఒక్కటి ఓడినా ఇంటి ముఖం పట్టాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com