BCCI: గౌతం గంభీర్ అవుట్.. విరాట్ కోహ్లీ ఇన్.!

క్రికెట్ ప్రపంచంలో కొన్ని పేర్లు వింటేనే అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్పందన కలుగుతుంది. అలాంటి అరుదైన పేర్లలో ముందుగా వినిపించేది కింగ్ కోహ్లీ. దూకుడు, ఆత్మవిశ్వాసం, అసమానమైన ఫిట్నెస్, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పే సామర్థ్యం—ఇవన్నీ కలగలిసిన వ్యక్తిత్వం విరాట్ కోహ్లీ. భారత క్రికెట్‌కు ఆయన ఇచ్చిన సేవలు, సాధించిన విజయాలు మాటల్లో చెప్పలేనివి. అలాంటి కోహ్లీ గురించి ఇప్పుడు మరోసారి ఆసక్తికరమైన ప్రచారం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కింగ్ కోహ్లీ… మళ్లీ అదే ఫార్మెట్లోకి రీఎంట్రీ ఇస్తాడా? 2026లో మరోసారి తెల్లజెర్సీలో ఆయనను చూడొచ్చా? అనే ప్రశ్నలు అభిమానుల్ని ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. ఈ ప్రచారం వెనుక ఓ “మ్యాజిక్” ఉందని, అది జరిగితేనే కోహ్లీ పునరాగమనం సాధ్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గంభీర్‌పై వేటు పడితే...
. ఈ ఫార్మెట్లోకి విరాట్ రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా ఒక మ్యాజిక్ జరగాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా.. గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ పదవిని కోల్పోపోవడం. అవును కింగ్ కోహ్లీ ఈ ఫార్మెట్లోకి గంభీర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నప్పుడే రావచ్చని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ వైఫల్యాల పరంపర కారణంగా ఆయనను ఈ ఫార్మెట్లో కోచ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే, విరాట్ ఈ ఫార్మెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
గంభీర్ పదవికి ముప్పు?
టెస్ట్ క్రికెట్లో భారత జట్టు వరుసగా వైఫల్యాలను చవిచూస్తుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గంభీర్ భవిష్యత్తు ఇప్పుడు టి20 వరల్డ్ కప్ 2026 ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలవకపోతే గంభీర్‌ను తప్పించి, మరొక దిగ్గజాన్ని కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. అదే జరిగితే విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. కోహ్లీ తన మనసులో ఎక్కడో ఒక చోట రిటైర్మెంట్ తొందరగా తీసుకున్నానా? అనే అసంతృప్తితో ఉన్నారని సన్నిహిత వర్గాల టాక్.
10 వేల పరుగుల మైలురాయి
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కోహ్లీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తే, టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని సులభంగా చేరుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టులను ప్రేమించే కోహ్లీని మళ్లీ వైట్ బాల్‌తో చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోహ్లీ 2024 మే 12న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే, ఇంకా చాలా ఇవ్వగలిగే స్థాయిలో ఉన్న ఆటగాడు ఇలా అకస్మాత్తుగా తప్పుకోవడం అనూహ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

