Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల..
Rishabh Pant: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ బాధాకరమైన దశ నుండి బయటపడేందుకు వికెట్ కీపర్‌కు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందుతుందని బోర్డు తెలిపింది.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైద్యుల పరిశీలనలో ఉన్నారని, అతని పరిస్థితి నిలకడగా ఉందని డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం జరిగిన ఘోర కారు ప్రమాదం నుండి బయటపడిన భారత క్రికెటర్ రిషబ్ పంత్, అతడి తలపై బలమైన గాయాలు, కుడి మోకాలిలో గాయం తీవ్రతను తగ్గించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని సక్షం హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ ట్రామా సెంటర్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు రిషబ్‌కు అత్యవసర చికిత్స అందించారు.
రిషబ్ పరిస్థితి నిలకడగా ఉంది. అతడిని ఇప్పుడు డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతనికి MRI స్కాన్‌లు చేసి గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి తదుపరి చికిత్సా విధానాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం రిషబ్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులతో, రిషబ్ కుటుంబంతో బిసిసిఐ నిరంతరం టచ్‌లో ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com