BCCI: బీసీసీఐ ఖాతాలో రూ.20 వేల కోట్లకుపైగా నిధులు

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ తన ఖజానాను మరింత నింపుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ ఆర్థిక నివేదికలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిణీ చేసిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగిసేనాటికి బీసీసీఐ బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ. 20,686 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గత ఐదేళ్లలో బోర్డు సంపద దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం. అత్యంత విజయవంతమైన ఐపీఎల్‌తో బోర్డుకు భారీగా ఆదాయం వస్తోంది. అలాగే ఐసీసీ నుంచి అందే వాటాతోపాటు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచుల మీడియా హక్కుల నుంచి ఆదాయం అందుతోంది. బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,623 కోట్ల మిగులు నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది రూ.1,167 కోట్లుగా ఉండేది.
ఐదేళ్లలో అనూహ్యంగా పెరిగిన సంపద
గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐ సంపద అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సంఘాలకు నిధులు పంపిణీ చేయకముందు బోర్డు వద్ద రూ. 6,059 కోట్లు ఉండగా, ఇప్పుడు అన్ని పంపిణీలు పూర్తయ్యాక కూడా రూ. 20 వేల కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటం విశేషం. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే బీసీసీఐ ఆస్తికి రూ. 4,193 కోట్లు అదనంగా చేరాయి. ఐదేళ్లలో మొత్తం రూ. 14,627 కోట్ల వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో బీసీసీఐ జనరల్ ఫండ్ కూడా 2019లో రూ. 3,906 కోట్ల నుంచి 2024 నాటికి రూ. 7,988 కోట్లకు పెరిగింది. బీసీసీఐ వద్ద 2019 నాటికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఉండేవి. అయితే, గత ఐదేళ్లలో అదనంగా రూ.14,627 కోట్ల సంపదను సృష్టించింది.
ఏడాదే రూ.4,193 కోట్ల ఆదాయం
‘‘బీసీసీఐ సభ్యులకు కార్యదర్శి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ రూ.6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించినది పోగా మిగులు రూ.20,686 కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో రూ.14,627 కోట్ల సంపద అదనంగా వచ్చి చేరింది. ఒక్క గతేడాదే రూ.4,193 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,200 కోట్లను మైదానాల్లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది. ప్లాటినమ్ జూబ్లీ ఫండ్‌గా రూ. 350 కోట్లు, క్రికెట్ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలు రూ.1,990 కోట్లు అందుకొన్నాయి’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం రూ. 3,150 కోట్లను కేటాయించింది. దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,200 కోట్లు, మాజీ ఆటగాళ్ల సంక్షేమం కోసం ప్లాటినం జూబ్లీ ఫండ్‌కు రూ. 350 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు మరో రూ. 500 కోట్లు కేటాయించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 28న ముంబైలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. రూ.20,686 కోట్లకు చేరుకుని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ సంస్థగా నిలిపింది. ఈ పెరుగుదల రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన తర్వాత మిగిలిందని బీసీసీఐ కార్యదర్శి వెల్లడించారు. సెప్టెంబర్ 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com