BCCI: 18వ నంబర్ జెర్సీతో పంత్.. రచ్చ.. రచ్చ

దక్షిణాఫ్రికా Aతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ 18వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగాడు. పంత్ కోలుకుని మళ్లీ మైదానంలో కనిపించడం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 18 నంబర్ జెర్సీ టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీది కావడంతో కొంత వివాదాస్పదమైంది. కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పంత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పంత్ జెర్సీ నంబర్ 17. పొరపాటున 18గా ముద్రితమైన జెర్సీని ధరించాడా?అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. లేకపోతే కావాలనే ఆ నంబర్ జెర్సీని వేసుకొని వచ్చాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇంతకుముందు ముకేశ్ కుమార్ (జెర్సీ నంబర్ 49) కూడా గత ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ‘A’ జట్టు తరఫున బరిలోకి దిగినప్పుడు 18వ నంబర్ జెర్సీని ధరించాడు. స్టార్ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు పలికినప్పుడు ఆ జెర్సీ నంబర్లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయడం ఆనవాయితీగా వస్తోంది. సచిన్ తెందూల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు బీసీసీఐ ఇలానే చేసింది.
రిషభ్ పంత్ రీఎంట్రీ
గాయంతో ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పంత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో గురువారం ప్రారంభమైన తొలి అనధికార టెస్ట్‌తో పంత్ పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టును నడిపిస్తున్న రిషభ్ పంత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్.. ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. ఈ గాయం కారణంగా పంత్.. ఆసియా కప్ టోర్నీతో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ పంత్ బరిలోకి దిగలేదు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లకు సన్నాహకంగా జరుగుతున్న అనధికార టెస్ట్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. రెండో అనధికార మ్యాచ్‌కు సీనియర్లు బరిలోకి దిగనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

