BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా

BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా
X
తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా.. సెప్టెంబర్‌లో బీసీసీఐ వార్షిక సదస్సు... ఆ సదస్సులోనే కొత్త బీసీసీఐ బాస్

భారత క్రి­కె­ట్ ని­యం­త్రణ మం­డ­లి (బీ­సీ­సీఐ)లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. 1983 వర­ల్డ్ కప్ హీరో రో­జ­ర్ బి­న్నీ బీ­సీ­సీఐ అధ్య­క్ష పద­వి­కి రా­జీ­నా­మా చే­శా­రు. ఆయన స్థా­నం­లో బీ­సీ­సీఐ వైస్ ప్రె­సి­డెం­ట్ రా­జీ­వ్ శు­క్లా తా­త్కా­లిక బీ­సీ­సీఐ తా­త్కా­లిక అధ్య­క్షు­డి­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టా­రు. బు­ధ­వా­రం జరి­గిన అపె­క్స్ కౌ­న్సె­ల్‌ సమా­వే­శం­లో కొ­త్త స్పా­న్స­ర్ కోసం అన్వే­షణ, త్వ­ర­లో జర­గ­ను­న్న ఎన్ని­క­ల­పై సు­దీ­ర్ఘం­గా చర్చిం­చా­రు. ఈ భేటీ తర్వాత రో­జ­ర్ బి­న్నీ రా­జీ­నా­మా చే­శా­రు. బీ­సీ­సీఐ ని­బం­ధ­నల ప్ర­కా­రం అధ్య­క్ష పద­వి­కి గరి­ష్ట వయో­ప­రి­మి­తి 70 సం­వ­త్స­రా­లు. రో­జ­ర్ బి­న్నీ ఈ ఏడా­ది జులై 19న తన 70వ జన్మ­ది­నో­త్స­వా­న్ని జరు­పు­కు­న్నా­రు. దీం­తో ని­బం­ధ­నల ప్ర­కా­రం అధ్య­క్ష పద­వి­లో కొ­న­సా­గే అర్హ­త­ను కో­ల్పో­యా­రు. అయి­తే తా­జా­గా ‘నే­ష­న­ల్‌ స్పో­ర్ట్స్‌ బి­ల్‌’ పా­ర్ల­మెం­ట్‌­లో ఆమో­దం పొం­దిం­ది. దీని ప్ర­కా­రం క్రీ­డా సం­ఘాల ఆఫీ­స్‌ బే­ర­ర్ల వయో­ప­రి­మి­తి­ని 75 ఏళ్ల­కు పెం­చా­రు. అయి­నా రా­ను­న్న ఎన్ని­క­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని రో­జ­ర్ బి­న్నీ రా­జీ­నా­మా చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది.

క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ

బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.

తనదైన ముద్ర వేసిన బిన్నీ

రో­జ­ర్ బి­న్నీ అక్టో­బ­ర్ 2022లో బీ­సీ­సీఐ 36వ అధ్య­క్షు­డి­గా ఎన్ని­క­య్యా­రు. ఆయన భారత మాజీ కె­ప్టె­న్ సౌ­ర­వ్ గం­గూ­లీ స్థా­నం­లో బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చా­రు. గం­గూ­లీ తన మూ­డే­ళ్ల పద­వీ­కా­లా­న్ని పూ­ర్తి చే­సు­కో­గా.. బి­న్నీ ఒక్క­డే పద­వి­కి పో­టీ­ప­డ్డా­రు. బి­న్నీ బీ­సీ­సీఐ అధ్య­క్షు­డైన తర్వాత.. భా­ర­త్‌ రెం­డు పరి­మిత ఓవ­ర్ల ఫా­ర్మా­ట్ ఐసీ­సీ టో­ర్న­మెం­ట్‌­ల­ను గె­లు­చు­కుం­ది. 2024 ఐసీ­సీ టీ20 ప్ర­పంచ కప్, 2025 ఐసీ­సీ ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ­ని గె­లు­చు­కుం­ది. చా­రి­త్రా­త్మక ఉమె­న్స్ ప్రీ­మి­య­ర్ లీగ్ కూడా బి­న్నీ అధ్య­క్షు­రా­లి­గా ఉన్న సమ­యం­లో మొ­ద­లైం­ది. ఆయన అధ్య­క్షు­డి­గా ఉన్న సమ­యం­లో దే­శీయ క్రి­కె­ట్‌­కు ప్రా­ధా­న్యం లభిం­చిం­ది. ఆట­గా­ళ్ల జీ­త­కా­లు సైతం పె­రి­గా­యి. టీ­మిం­డి­యా సీ­ని­య­ర్లు సైతం డొ­మె­స్టి­క్‌ క్రి­కె­ట్‌ ఆడే­లా బీ­సీ­సీఐ కఠిన చర్య­లు తీ­సు­కుం­ది. రో­జ­ర్ బి­న్నీ 1983 ప్ర­పంచ కప్ వి­జేత జట్టు­లో కీలక సభ్యు­డు. ఆల్‌ రౌం­డ­ర్‌ బి­న్నీ 27 టె­స్ట్ మ్యా­చ్‌­లు, 72 వన్డే­ల్లో భా­ర­త­దే­శా­ని­కి ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు. టె­స్ట్ మ్యా­చు­ల్లో 47 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు. ఐదు హాఫ్ సెం­చ­రీల సహా­యం­తో 830 పరు­గు­లు చే­శా­డు. 72 వన్డే­ల్లో 77 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు. హా­ఫ్‌ సెం­చ­రీ సహా­యం­తో 629 పరు­గు­లు చే­శా­డు. భా­ర­త్‌ తొలి వన్డే ప్ర­పంచ కప్ (1983) గె­ల­వ­డం­లో ము­ఖ్య­మైన పా­త్ర పో­షిం­చా­డు. 1983 ప్ర­పంచ కప్‌­లో టీ­మిం­డి­యా తర­ఫున అత్య­ధిక వి­కె­ట్లు తీ­సిన బౌ­ల­ర్‌­గా ని­లి­చా­డు. వర­ల్డ్‌ కప్‌­లో 18 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు. బి­న్నీ గతం­లో బీ­సీ­సీఐ సె­ల­క్ష­న్ కమి­టీ సభ్యు­డి­గా పని చే­శా­రు.

Tags

Next Story