BCCI: భారత క్రికెట్‌‌‌లో సంచలన మార్పులు..!

BCCI: భారత క్రికెట్‌‌‌లో సంచలన మార్పులు..!
X
భారత క్రికెట్‌లో సంచలన మార్పులు?... టీమిండియాకు నయా కెప్టెన్...విమెన్స్ టీంకి కూడా...గంభీర్ పై వేటు? చీఫ్ సెలెక్టర్ మార్పు!

భారత పు­రు­షుల క్రి­కె­ట్ జట్టు 2026లోకి అడు­గు­పె­డు­తూ మి­శ్రమ అను­భ­వా­ల­తో ముం­దు­కు కొ­న­సా­గు­తోం­ది. ఒక­వై­పు 2025 ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ­తో పాటు ఆసి­యా కప్‌­ను గె­లు­చు­కొ­ని ఘన వి­జ­యా­లు సా­ధిం­చ­డం­తో పాటు మరో­వై­పు స్వ­దే­శం­లో దక్షి­ణా­ఫ్రి­కా చే­తి­లో టె­స్టు సి­రీ­స్‌­లో వై­ట్‌­వా­ష్‌­కు గురై చరి­త్రా­త్మక పరా­భ­వా­న్ని చవి­చూ­సిం­ది. గత రెం­డే­ళ్ల­లో ఇది రెం­డో­సా­రి స్వ­దే­శం­లో టె­స్టు­ల్లో ఇలా జర­గ­డం. అయి­తే, కొ­త్త సం­వ­త్స­రం ప్రా­రం­భం నుం­చే డ్రె­స్సిం­గ్ రూ­మ్‌­లో అసం­తృ­ప్తి, ఆఫ్-ఫీ­ల్డ్ వి­వా­దా­లు జట్టు­ను వెం­టా­డా­యి. ఇవ­న్నీ కలి­సి జట్టు నా­య­క­త్వం­పై తీ­వ్ర­మైన ఒత్తి­డి­ని తీ­సు­కొ­చ్చా­యి. కొ­త్త ఏడా­ది­లో­కి అడు­గు పె­డు­తు­న్న వేళ జట్టు­లో కీలక మా­ర్పు­లు జర­గ­ను­న్న­ట్లు వా­ర్త­లు బలం­గా వి­ని­పి­స్తు­న్నా­యి.

కొ­త్త కె­ప్టె­న్ ఎవరు? అయి­తే, యంగ్ క్రి­కె­ట­ర్ గి­ల్‌­ను ఈ ఏడా­ది వన్డే, టె­స్టు కె­ప్టె­న్‌­గా ఎం­పి­క­య్యా­డు. వయసు కూడా అత­డి­కి అను­కూ­లం­గా ఉం­డ­టం­తో ఈ రెం­డు ఫా­ర్మా­ట్ల­లో సు­దీ­ర్ఘ­కా­లం కొ­న­సా­గ­ను­న్న­ట్లు కని­పి­స్తోం­ది. కానీ, టీ20 ఫా­ర్మా­ట్‌­లో పరి­స్థి­తి భి­న్నం­గా ఉంది. ప్ర­స్తుత కె­ప్టె­న్ సూ­ర్య కు­మా­ర్ యా­ద­వ్ వయ­స్సు 35గా ఉంది. అలా­గే, ఇటీ­వ­లి కా­లం­లో అతని బ్యా­టిం­గ్ తీ­వ్ర ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. 2026 టీ20 వర­ల్డ్ కప్ ము­గి­సిన తర్వాత ఫలి­తం ఎలా ఉన్నా సరే కొ­త్త కె­ప్టె­న్ కోసం బీ­సీ­సీఐ ఆలో­చిం­చే అవ­కా­శం ఉంది.

గంభీర్ పై వేటు

గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, టెస్టు క్రికెట్‌లో మాత్రం ఘోర ఓటములను చవిచూసింది. ఆయన హయాంలో స్వదేశంలో రెండు సార్లు వైట్‌వాష్ కావడం భారత క్రికెట్ కు మాయని మచ్చగా మిగిలింది. జూన్ వరకు భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేకపోయినా, రెడ్ బాల్ క్రికెట్‌లో మార్పులు తప్పవన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రత్యేక రెడ్‌బాల్ కోచ్ లేదా క్రికెట్ డైరెక్టర్ నియామకం జరిగే ఛాన్స్ ఉంది.

మహి­ళల జట్టు­కు కొ­త్త కె­ప్టె­న్..ఇక, భారత మహి­ళల జట్టు మా­త్రం 2026ను అత్యంత ఉత్సా­హం­తో ప్రా­రం­భి­స్తోం­ది. తొ­లి­సా­రి­గా వర­ల్డ్ కప్‌­ను గె­లు­చు­కొ­ని చరి­త్ర సృ­ష్టిం­చిన ఉమె­న్స్. ఆ వి­జ­యా­న్ని కొ­న­సా­గిం­చ­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­ని కొ­త్త ఏడా­ది­లో­కి అడు­గు పె­డు­తోం­ది. అయి­తే, ముం­దు­న్న సవా­ళ్ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని జట్టు కూ­ర్పు­పై బీ­సీ­సీఐ ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టా­ల్సిన అవ­స­రం ఉంది. కాగా, మహి­ళల టీ20 వర­ల్డ్ కప్ (జూన్ 2026) అనం­త­రం నా­య­క­త్వ మా­ర్పు జరి­గే అవ­కా­శం ఉంది. 2028 నా­టి­కి హర్మ­న్‌­ప్రీ­త్ కౌర్ వయ­స్సు 38కి వస్తుం­డ­టం­తో, స్మృ­తి మం­ధా­నా­కు కె­ప్టె­న్సీ బా­ధ్య­త­లు అప్ప­గిం­చే అవ­కా­శం ఉంది.

చీఫ్ సె­లె­క్ట­ర్ మా­ర్పు..చీఫ్ సె­లె­క్ట­ర్ అగా­ర్క­ర్ ఒప్పం­దం ఈ ఏడా­ది­తో ము­గి­య­నుం­ది. న్యూ­జి­లాం­డ్ సి­రీ­స్, టీ20 వర­ల్డ్ కప్ జట్టు ఎం­పి­క­లే అత­డి­కి చి­వ­రి ని­ర్ణ­యా­ల­య్యే అవ­కా­శం ఉంది. గతే­డా­ది పొ­డి­గిం­పు ఇచ్చి­నా, మరో­సా­రి కొ­న­సా­గ­డం కష్ట­మే­న­ని తె­లు­స్తుం­ది. దీం­తో కొ­త్త చీఫ్ సె­లె­క్ట­ర్ ని­యా­మ­కం ఖా­యం­గా కని­పి­స్తోం­ది. ప్ర­స్తుత కమి­టీ సభ్యు­ల్లో అత్య­ధిక అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­లు ఆడిన ప్ర­గ్యా­న్ ఓజా తదు­ప­రి చీఫ్ సె­ల­క్ట­ర్ అయ్యే ఛా­న్స్ ఉంది. మరో­వై­పు, మహి­ళల సె­ల­క్ష­న్ కమి­టీ­లో ఇప్ప­టి­కే మా­ర్పు­లు చే­ప­ట్టా­రు. నీతూ డే­వి­డ్ పద­వీ­కా­లం వర­ల్డ్ కప్ జట్టు­తో ము­గి­య­గా, సె­ప్టెం­బ­రు­లో అమి­తా శర్మ­ను ని­య­మిం­చా­రు. ఆమె ఇటీ­వల శ్రీ­లం­క­తో జరి­గే ఐదు టీ20ల సి­రీ­స్‌­కు తన తొలి జట్టు­ను ప్ర­క­టిం­చిం­ది. ఇక, 2026 భారత క్రి­కె­ట్‌­కు మా­ర్పుల సం­వ­త్స­రం­గా మారే అవ­కా­శా­లు స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­యి. కె­ప్టె­న్, కోచ్, సె­లె­క్ట­ర్ వంటి మూడు కీలక స్థా­యి­ల్లో­నూ ని­ర్ణ­యా­త్మక మా­ర్పు­లు జర­గ­నుం­డ­టం­తో భారత క్రి­కె­ట్ భవి­ష్య­త్ పై అం­ద­రు దృ­ష్టి పె­ట్టా­రు.

Tags

Next Story