Dream11: భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా డ్రీమ్11

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫార్మ్ డ్రీమ్-11(Dream11) ఉండబోతుంది. ఈ మేరకు డ్రీమ్-11తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు శుక్రవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టుకు 3 సంవత్సరాల పాటు డ్రీమ్-11 జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది.ఇంతకు ముందు డ్రీమ్11 అధికారిక స్పాన్సర్లుగా ఉండేవారు. ఇటీవలె ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంతకు ముందు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(BYJU's)తో కాంట్రాక్ట్ గడువు మార్చిలో పూర్తయింది. నవంబర్ దాకా పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ బైజూస్ దిగిపోయింది. అనంతరం జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రధాన స్పాన్సర్ లోగో లేకుండానే బరిలో దిగింది. ఇప్పుడు డ్రీమ్11 ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. విండీస్ పర్యటన నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.
ఈ నెలలో జరగనున్న వెస్టిండీస్ పర్యటనలో టీం ఇండియా టెస్ట్ జట్టు ఆటగాళ్ల జెర్సీలపై డ్రీమ్-11 లోగో ఉండనుంది. ఈ టెస్ట్ సిరీస్ 2023-2025 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి టెస్ట్ సిరీస్. విండీస్ పర్యనలో భారత్ మొత్తం 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. మొదటి టెస్ట్ జులై 12న ప్రారంభమవనుంది.
డ్రీమ్11 తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. బీసీసీఐ అధికారిక స్పాన్సర్ నుంచి ప్రధాన స్పాన్సర్‌గా ఎదిగిలేలా మా మధ్య బంధం బలపడింది. ఇది భారత క్రికెట్ అందించే నమ్మకం, విలువ, సామర్థ్యం, వృద్ధికి ప్రత్యక్ష నిదర్శనం.ఈ సంవత్సరంలో వరల్డ్‌కప్ జరుగుతున్నందున అభిమానులతో అనుబంధం ఉండేలా చేయడం మా మొదటి ప్రాధాన్యత. ఈ డీల్ అభిమానులతో మరింత అనుబంధానని ఏర్పరగలదని నేను నమ్ముతున్నాని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వెల్లడించాడు.
డ్రీమ్ 11 సీఈవో హర్ష్ జైన్ స్పందిస్తూ... క్రికెట్ పట్ల డ్రీమ్11 కి ఉన్న ప్రేమని భారతదేశంలోని కోట్లాది మందితో పంచుకుంటున్నాము. బీసీసీఐతో జతకట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం. భారత్‌లో క్రీడలకు తగినంత మద్దతు ఇవ్వడానికి మేము ఎల్లపుడూ ప్రయత్నిస్తూనే ఉంటామని వెల్లడించారు.
2019 లో అంతకు ముందు ఉన్న ఒప్పో స్థానంలో బైజూస్ కంపెనీ వచ్చింది. 2022లో మళ్లీ 2023 సంవత్సరం దాకా కాంట్రాక్ట్‌ను పొడిగించుకుంది. ఇప్పుడు డ్రీమ్11 భర్తీ చేయనుంది. భారత్‌లో ఫాంటసీ గేమ్స్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com