BCCI: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాక్?

టీమిండియా క్రికెటర్లకు BCCI షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో BGT సిరీస్ వైఫల్యంతో ఆటగాళ్ల ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడుతుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌గా ఉంటారని కొందరు భావిస్తుంటే.. ఒత్తిడి పెరుగుతుందని మరికొందరు అంటున్నారు.
గంభీర్ స్వేచ్ఛకు బీసీసీఐ కత్తెర
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను ప్రధాన కోచ్ గంభీర్‌కు ఇచ్చింది. జట్టు ఎంపికతోపాటు సహాయక కోచ్‌లను తనకు ఇష్టమైన వారిని తీసుకొనే అవకాశం కల్పించింది. కానీ సత్ఫలితాలు రాకపోవడంతో గంభీర్ స్వేచ్ఛకు కత్తెర వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అర్ష్‌దీప్ బెస్ట్ ఆప్షన్: హర్మీత్ సింగ్
షమీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు, సిరాజ్ ప్రదర్శనలో ఇబ్బంది, బుమ్రా గాయంపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో అర్ష్‌దీప్ మంచి ఆప్షన్ అంటూ పంజాబ్ బౌలింగ్ కోచ్ హర్మీత్ సింగ్ బన్సాల్ వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే ముందు ఏమైనా అనుమానాలు ఉంటే విజయ్ హజారే ట్రోఫీలో అతడి బౌలింగ్ స్పెల్‌ను చూసి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. కాగా, ఆ ట్రోఫీలో అర్ష్‌దీప్ అత్యధిక వికెట్లు(20) తీయడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com