క్రీడలు

pv sindhu : సింధు ఓటమిలో 'ఆ అరగంట'

ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. తైపే క్రీడాకారిణి తై- జు-యింగ్ చేతిలో వరుస సెట్లలో ఆమె పరాజయం పాలైంది.

pv sindhu  : సింధు ఓటమిలో ఆ అరగంట
X

ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. తైపే క్రీడాకారిణి తై- జు-యింగ్ చేతిలో వరుస సెట్లలో ఆమె పరాజయం పాలైంది. తొలిసెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివర్లో తైజు పుంజుకుంది. ఇక రెండో సెట్‌‌లో మాత్రం సింధు పైన తై- జు-యింగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీనితో సింధుకి ఓటమి తప్పలేదు. దాదాపు ఆరగంట పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు ఓటమి పైన చాలా మంది క్రీడా విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా మ్యాచ్ ప్రారంభంలో మంచి దూకుడిని ప్రదర్శించిన ఆమె.. మ్యాచ్ సాగే కొద్దీ మాత్రం పట్టును కోల్పోయింది. మొదటి సెట్‌‌లో కాస్త వెనుకబడ్డ సింధు.. రెండో సెట్‌‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆ సమయానికి ఒలింపిక్స్ స్వర్ణం గెలవాలనుకున్న ఒత్తిడి ఆమె పైన బాగా పెరిగి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తైజూయింగ్‌ వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది.. ఆమె అటాకింగ్ గేమ్‌‌ని అంచనా వేయడంలో సింధు కాస్త వెనకబడిందని అంటున్నారు. సింధు తొలి సెట్ గెలిచి ఉంటే రెండో సెట్‌‌లో ఆమెపై ఒత్తిడి ఉండకపోయేదని, దీనితో ఫలితం మరోలా వుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సెట్ కోల్పోవడంతో సింధు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి ఇక చేతులెత్తేసినట్లుగా ఆమె ఆట కనిపించదని అంటున్నారు.

అటు పుల్లెల గోపీచంద్‌‌తో విభేదాలున్నాయని గత కొంతకాలంగా వార్తలు రావడం.. ఆమె పై, అట పై ప్రభావాన్ని చూపించి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కాగా సింధుకు ఇంకా పతకంపై ఆశలు మిగిలే ఉన్నాయి. మరో సెమీస్‌లో ఓటమిపాలైన హి బింగ్జియావో క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది. అలా అయినా భారత్‌కు, సింధుకు ఘనత దక్కినట్టేననిచెప్పాలి. గత ఒలింపిక్స్‌లో రజతం.. ఈసారి కాంస్యం సాధించిన ప్లేయర్‌గా ఆమెకి గుర్తింపు దక్కుతుంది. ఈ మ్యాచ్ రేపు(ఆదివారం) సాయంత్రం జరగనుంది.

Next Story

RELATED STORIES