BGT: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్..!

BGT: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్..!
X
అయిదో టెస్టుకు జట్టులో తుది స్థానం కష్టమే... చెత్త షాట్స్ ఆడి ఔటవ్వడంతో సెలక్టర్లు ఆగ్రహం

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. BGTలో దారుణంగా విఫలమవుతున్న పంత్ ను టెస్టు జట్టు నుంచి తప్పించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టులో మ్యాచ్ గెలిపించడమో లేక డ్రా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని భావించగా అనవసరమైన చెత్త షాట్స్ ఆడి ఔటవ్వడంతో సెలక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సిడ్నీ టెస్టుకు వరుణుడి ముప్పు

BGTలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య చివరి టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంతరాయం క‌లిగించే అవ‌కాశ‌ముందని వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే. BGT సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది.

వారిద్దరూ రిటైరైనా నష్టం లేదు: మాజీ కోచ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లెమాన్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘రాబోయే రోజుల్లో విరాట్, రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్నా.. భారత క్రికెట్‌కు ఇబ్బందేం లేదు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అందులో జైస్వాల్ ఒకడు. ఇక పేస్ గుర్రం బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని అన్నాడు.

పుజారా కావాలన్న గంభీర్.. వద్దన్న సెలెక్టర్లు

బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. ఈ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న రోహిత్‌ శర్మ, కోహ్లీతో పాటు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్‌లో సీనియర్‌ ఛతేశ్వర్‌ పుజారాను జట్టులోకి తీసుకోవాలని గంభీర్‌ భావించాడని తెలుస్తోంది. హెడ్‌ కోచ్‌ ప్రతిపాదనను సెలెక్టర్లు తిరస్కరించినట్లు ఓ నివేదిక తెలిపింది. దీంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Tags

Next Story