BGT: 96 ఏళ్ల రికార్డును భారత్ బద్దలు కొడుతుందా..?

BGT: 96 ఏళ్ల రికార్డును భారత్ బద్దలు కొడుతుందా..?
X
రసవత్తరంగా బాక్సింగ్ డే టెస్టు... టాపార్డర్‌పైనే భారం

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 228/9 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. దీంతో బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియాకు భారీ లక్ష్యమే నిలిచింది. సోమవారం ఆట షెడ్యూల్ కంటే అర్ధ గంట ముందే ప్రారంభం కానుంది. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు 96 ఏళ్ల నుంచి కొనసాగుతున్న రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. మెల్‌బోర్న్‌ మైదానం వేదికగా జరిగిన టెస్టులో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. ఆసీస్‌పై 1928లో 332 పరుగులను ఛేదించి ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. టీమ్‌ఇండియా ఇక్కడ ఆడిన గత రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు కూడా టాప్‌ ఆర్డర్ రాణిస్తే లక్ష్య ఛేదన పెద్ద కష్టం కాబోదనేది క్రికెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

కంగారులను కంగారు పెట్టేది హైదరాబాదీలే!

అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లను కంగారు పట్టేది హైదరాబాదీలే. ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన ప్రతిసారి భారత్ కష్టాల్లో పడుతుంది. అలాంటి సమయంలో హైదరాబాదీ ప్లేయర్లే ఆదుకుంటారు. 2001లో వీవీస్ లక్ష్మణ్.. కంగారు గర్వాన్ని అణచి.. కంగారు పెట్టించాడు. తాజాగా BGT మెల్ బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి కూడా కష్టాల్లో ఉన్న భారత్ ను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా.. ఆసీస్ ప్లేయర్ల బెండు విరిచాడు.

యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్‌పై విమర్శలు

కీలక సమయాల్లో మూడు క్యాచ్‌లను వదిలేసిన యశస్వి జైస్వాల్ పేలవ ఫీల్డింగ్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పిదాల కారణంగా జట్టు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో జైస్వాల్‌పై కోపంగా కనిపించారు. ఆయన ప్రదర్శన టీమ్ వ్యూహం, ఫీల్డింగ్‌పై ప్రశ్నలను లేవనెత్తింది. దీంతో నెటిజన్లు జైస్వాల్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

Tags

Next Story