IPL: ఉప్పల్ లో బ్లాక్ టికెట్ల దందా

IPL: ఉప్పల్ లో బ్లాక్ టికెట్ల దందా
X
ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు... టికెట్లు స్వాధీనం

ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాను పోలీసులు బట్టబయలు చేశారు. ఆదివారం హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్ టికెట్లను ఉప్పల్ లోని మెట్రో స్టేషన్ కింద బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

కళ్లు చెదిరేలా ఐపీఎల్ ఆరంభ వేడుకలు

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025, 18వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. గత ఐపీఎల్ సీజన్లలా కాకుండా, ఈ ఏడాది IPL 13 వేదికలలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. మ్యూజిక్, ఎంటర్ టైన్మెంట్‌తో కార్యక్రమాలతో ఐపీఎల్ 2025 శనివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ఓపెనింగ్ వేడుక అభిమానులను ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

గూగుల్ డూడుల్ కూడా ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఈ రోజు(శనివారం) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. ఇక తొలి మ్యాచ్‌‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఓపెనింగ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు తొలగిపోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేనట్లే!

IPL-2025 తొలి మ్యాచ్‌లో ఈ రోజు కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

Tags

Next Story