IPL: జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం విరుచుకుపడింది. దాదాపు 100 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా దళాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. మే 16న పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ తన చివరి లీగ్‌మ్యాచ్‌ను ఇక్కడే ఆడనుంది. జైపుర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం అధికారులకు ఉదయం 9.13 గంటలకు ఓ మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఇందులో ఆపరేషన్ సిందూర్ గురించి పేర్కొంటూ.. ‘‘ ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. ఈ మెయిల్‌పై అధికారిక వర్గాలు విచారణ మొదలుపెట్టాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com