Boxing Championship: అదిరిన హైదరాబాదీ పంచ్! బంగారు పతాకం కైవసం చేసుకున్న నిఖత్

Boxing Championship: అదిరిన హైదరాబాదీ పంచ్! బంగారు పతాకం కైవసం చేసుకున్న నిఖత్
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాదీ పంచ్ లు మెరిశాయి. భోపాల్ లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మన హైదాబాదీ అమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ తో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.
50కేజీల విభాగంలో రైల్వే బోర్డ్ తరఫున బరిలోకి దిగిన అనామికతో హోహాహోరీ తలపడిన నిఖత్ 4-1స్కోర్ బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర యువజన, క్రీడాశాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాగుర్, భారత బాక్సింగ్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విజేతలకు పతాకాలను అందజేశారు.
ఛాంపియన్ షిప్ ఆఖరి రోజున రైల్వే బోర్డ్ కు చెందిన మంజురాణి తమిళనాడుకు చెందిన కలైవాణిపై 5-0స్కోర్ తో భారీ విజయం సాధించారు. 48కేజీల విభాగంలో రైల్వే టీమ్ కు బంగారు పతాకం లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇక మధ్యప్రదేశ్ ఒక పసిడి, రెండు వెండి పతాకాలతో పాటూ 5 కాంస్య పతాకాలను కైవసం చేసుకుంది. ఆ తరువాత హర్యాణ మూడవ స్థానంలో నిలిచింది. 2021 లో ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న మణిపూర్ మాణిక్యం సనామచా తోక్ఛోమ్ చాను 70కేజీల విభాగంలో శృతి యాదవ్ పై విజయం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com