Neymar: నెయ్‌మార్‌తో సౌదీ క్లబ్‌ భారీ ఒప్పందం

Neymar: నెయ్‌మార్‌తో సౌదీ క్లబ్‌ భారీ ఒప్పందం
X
రూ. 900 కోట్లతో ఒప్పందం చేసుకున్న అల్‌ హిలాల్‌ క్లబ్‌

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల‌ర్ నెయ్‌మ‌ార్‌(Neymar)తో సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్‌(Al Hilal) క్లబ్‌ భారీ ఒప్పందం చేసుకుంది. కొన్ని రోజులుగా ఈ మిడ్‌ఫీల్డర్‌తో సౌదీ క్లబ్‌ జరుపుతున్న చర్చలు విజయవంతమయ్యాయి. ఈ ఒప్పందంతో రెండేళ్ల కాలానికి నెయ్‌మార్‌కు అల్‌ హిలాల్‌ క్లబ్‌ రూ.900 కోట్లు ముట్టజెప్పనుంది. వ‌చ్చే సీజ‌న్‌లో నెయ్‌మార్‌ ఈ కొత్త క్లబ్‌ తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఒప్పందంతో పారిస్ సెయింట్ జర్మనీ(PSG)తో నెయ్‌మ‌ార్‌ ఐదేళ్ల బంధానికి తెర‌ప‌డింది. నెయ్‌మ‌ర్ 2017లో పీఎస్‌జీ క్లబ్‌కు మారాడు. అప్పట్లోనే అత‌డికి పీఎస్‌జీ రూ. 2వేల కోట్లు ఇచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో అద్భుతంగా రాణించిన నెయ్‌మ‌ార్ 118 గోల్స్ చేశాడు. నిరుడు ఖ‌త‌ర్‌లో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నెయ్‌మ‌ర్ కెప్టెన్సీలోని బ్రెజిల్ సెమీస్‌లోనే వెనుదిరిగింది.

Tags

Next Story