Brendan Taylor : జింబాబ్వే క్రికెటర్ పై ICC మూడున్నరేళ్లపాటు నిషేధం..!

Brendan Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అన్ని క్రికెట్‌ల నుండి మూడున్నరేళ్లపాటు నిషేధించింది. బ్రెండన్ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు టేలర్‌ను దోషిగా గుర్తించి ఈ శిక్ష విధించింది. భారతీయ బుకీ నుండి స్పాట్ ఫిక్సింగ్ కోసం డబ్బు తీసుకున్నందుకు టేలర్ దోషిగా తేలాడు. కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని స్వయంగా టేలర్ వెల్లడించాడు.
35 ఏళ్ల టేలర్ నాలుగు అవినీతి ఆరోపణలను, డోపింగ్‌కు సంబంధించిన ఒక అభియోగాన్ని టేలర్ అంగీకరించినట్లు ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. ఐసీసీ తాజా నిర్ణయంతో 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు. అయితే బ్రెండన్ టేలర్ గత ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక భారత్‌కు చెందిన ఓ వ్యాపారితో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తాను డబ్బు తీసుకున్నానని ఈ నెల 24న టేలర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు బ్రెండన్.
The ICC has released a statement on Brendan Taylor.https://t.co/IYKHAVeZHa
— ICC (@ICC) January 28, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com