బ్రిజ్ భూషణ్ గూండాలు అమ్మని బెదిరిస్తున్నారు.. రక్షణ కల్పించండి: సాక్షి మాలిక్

బ్రిజ్ భూషణ్ గూండాలు అమ్మని బెదిరిస్తున్నారు.. రక్షణ కల్పించండి: సాక్షి మాలిక్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ 'గూండాలు' చురుకుగా మారారని సాక్షి మాలిక్ బుధవారం అన్నారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ 'గూండాలు' చురుకుగా మారారని సాక్షి మాలిక్ బుధవారం అన్నారు. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి తన తల్లికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మా భద్రత ప్రభుత్వ బాధ్యత అని సాక్షి మాలిక్ విలేకరుల సమావేశంలో అన్నారు.

డబ్ల్యుఎఫ్‌ఐ వివాదం మధ్య ఒక పెద్ద ట్విస్ట్‌లో, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్‌లకు వ్యతిరేకంగా బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీకి చెందిన జూనియర్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద "UWW ఈ 3 రెజ్లర్ల నుండి మా రెజ్లింగ్‌ను రక్షించండి" అని రాసి ఉన్న బ్యానర్‌లను పట్టుకుని సమావేశమయ్యారు. బ్రిజ్ భూషణ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై ముగ్గురు రెజ్లర్లు నిరసనకు దిగారు.

"బ్రిజ్ భూషణ్ ప్రభావశీలి అని మాకు తెలుసు, కానీ అతను తన నివాసం నుండి ఎవరితోనూ చర్చించకుండా అధ్యక్షుడిని ప్రకటించేంత శక్తిమంతుడని మాకు తెలియదు. ఇప్పుడు మేము జూనియర్ల రెజ్లింగ్ కెరీర్‌ను పాడుచేయదలుచుకోలేదు. నేను కుస్తీ నుండి సన్యాసం తీసుకున్నాను. నేను పూర్తి చేయలేని నా కలను జూనియర్ అమ్మాయిలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. వారు దేశం కోసం రెజ్టింగ్ లో రజతం, స్వర్ణం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఏ జూనియర్ అయినా మన కోసం బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను" అని సాక్షి మాలిక్ అన్నారు.

"కొత్త ఫెడరేషన్ లేదా తాత్కాలిక కమిటీతో మాకు ఎలాంటి సమస్య లేదు. బ్రిజ్ భూషణ్ సహాయకుడు సంజయ్ సింగ్‌తో మాత్రమే మాకు సమస్య ఉంది" అని సాక్షి తెలిపింది.

Next Story