BUMRAH: చరిత్ర సృష్టించిన బుమ్రా

ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 25వ సారి ఒకే మ్యాచ్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. ఈ సంఖ్యను చేరుకున్న మొదటి బౌలర్ చరిత్రలో నిలిచాడు. ఆ తరువాత స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. కాగా ఈ లీగ్‌లో ఇద్దరు బౌలర్లు అద్భుతంగా రాణించారు.
ఈ జాబితాలో బుమ్రా(25), చాహల్(22), తర్వాత లసిత్ మలింగా(19), రవీంద్ర జడేజా(17), అమిత్ మిశ్రా(17), సునీల్ నరైన్(17), హర్షల్ పటేల్(17) ఉన్నారు. ఈ సీజన్ ఆరంభంలోనే బుమ్రా.. ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను లసిత్ మలింగా రికార్డ్‌ను అధిగమించాడు. బుమ్రా ఇప్పటి వరకు 181 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో పేసర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో బుమ్రా 9 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com