KKR vs RR: సెంచరీతో చెలరేగి రాజస్థాన్‌ను గెలిపించిన బట్లర్

ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతున్న పదిహేడో సీజన్‌లో మరో థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. టేబుల్ టాపర్స్ నువ్వానేనా అన్నట్టు పోటీపడిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్జ యభేరి మోగించింది. విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్ఒంటిచేత్తో సంజూ సేనను గెలిపించాడు. మెగా టోర్నీలో రెండో సెంచరీతో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. కోల్‌కతా స్టార్ సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినా లాభం లేకపోయింది. ఈ విజయంతో రాజస్థాన్ టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు. అరోరాకు ఒక వికెట్ పడింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైశ్వాల్ 9 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టు స్కోరు 22 వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (12), రియాన్ పరాగ్ (34), ధ్రువ్ జురెల్ (2), రవిచంద్రన్ అశ్విన్ (8), షిమ్రాన్ హిట్‌మెయర్ (0)లు స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. దీంతో 121 పరుగులేక 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కష్టాల్లో పటింది. తొలుత నెమ్మదిగా ఆడిన జాస్ బట్లర్.. ఆ తర్వాత టాప్‌గేర్‌లోకి వచ్చాడు. రోవ్‌మన్ పోవెల్ (26)తో కలిసి 57 పరుగులు జోడించాడు. పోవెల్ ఔట్ అయ్యే సమయానికి జట్టు విజయానికి ఇంకా 19 బంతుల్లో 46 పరుగులు కావాలి. అప్పటికి బట్లర్ 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. చేయాల్సిన పరుగులు భారీగా ఉండటం.. బట్లర్ ఒక్కడే బ్యాటర్ ఉండటంతో కేకేఆర్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ తనలోని హిట్టర్‌ను బయటకు తీసిన బట్లర్.. సంచలన బ్యాటింగ్‌తో అలరించాడు. 18 ఓవర్‌లో 18 రన్స్, 19 ఓవర్‌లో 19 రన్స్ చేశాడు. దీంతో చివరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఓవర్ మొత్తం తనే ఆడిన బట్లర్ చివరి బంతికి సింగిల్ తీసి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో 107 పరుగులు చేసి.. ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com