BWF World Championships 2023: రెండో రౌండ్‌లోనే సింధు ఔట్

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్(BWF World Championships 2023)లో ఈ మాజీ ఛాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన సింధు(Former champion PV Sindhu) పరాజయం పాలైంది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన సింధు తొలిసారి రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోయింది.
సింధు, ఒకుహర( Sindhu and Okuhara ) గతంలో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో తలపడ్డారు. కానీ ఈసారి పోరు మాత్రం అలా జరగలేదు. ప్రత్యర్థిపై 10-8 రికార్డుతో బరిలోకి దిగిన సింధు ఎటాకింగ్‌లో పదను కనపడలేదు. తొలి గేమ్‌లో ఓ దశలో సింధు, ఒకుహర 6-6తో సమంగా నిలిచారు. తర్వాత విరామానికి ఒకుహర 11-9తో ఆధిక్యం సంపాదించింది. దూకుడు కొనసాగించిన ఒకుహర 16-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు అనవసర తప్పిదాలు చేయడం ఒకుహరకు కలిసివచ్చింది. అదే ఊపుతో తొలి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో పుంజుకున్న సింధు 9-0తో ఆధిక్యం సంపాదించింది. కానీ ఒకుహర క్రమంగా పుంజుకుంది. విరామం తర్వాత సింధు తప్పిదాలను సొమ్ము చేసుకున్న ఒకుహర.. ఆధిక్యాన్ని 18-14కు పెంచుకుంది. ఆ తర్వాత సులువుగానే సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్(Lakshya Sen, Prannoy) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21–11, 21–12తో కొరియాకు చెందిన జియోన్ హ్యోక్ పై గెలుపొందాడు. కేవలం 36 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. 5-1తో మొదటి గేమ్‌ను ప్రారంభించిన లక్ష్యసేన్( Lakshya Sen) 11-6తో మరింత ఆధిక్యం సంపాదించాడు. 21-11తో తొలి గేమ్‌ను గెలుచుకున్న లక్ష్య... 21-12తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. రేపు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుత్ వితిద్‌సర్న్‌తో లక్ష్య సేన్ తలపడతాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్(world No 9 Prannoy) 21–9, 21–14తో ఇండోనేషియాకు చెందిన చికొ అర వర్డొయోపై గెలుపొందారు. రేపు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ ఛాంపియన్‌లో సింగపూర్‌కు చెందిన కీన్ యెతో ప్రణయ్ తలపడతాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com