CHAHAL: 2019 వరల్డ్ కప్ ఓటమి.. బాత్రూమ్లో ఏడ్చేసిన కోహ్లీ

2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు రన్ మెషిన్, ది కింగ్ కోహ్లీ నాయకత్వం వహించాడు. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినా టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక భారత అభిమాని మాత్రమే కాకుండా జట్టులోని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. విరాట్ అయితే బాత్రూమ్లోకి వెళ్లి మరీ ఏడ్చినట్లు సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా వెల్లడించాడు. ప్రపంచ కప్ ఓటమి తర్వాత కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని చాహల్ వెల్లడించాడు. దానిని గుర్తు చేసుకుంటూ.. ‘‘2019 వరల్డ్ కప్ సమయంలోనూ కోహ్లీ ఏడవడం చూశా. అతడు మాత్రమే కాదు జట్టులోని ప్రతి ఒక్కరిదే అదే పరిస్థితి. నేనే చివరిగా క్రీజ్‌లో నుంచి వచ్చా. కోహ్లీను దాటి ముందుకెళ్తుంటే అప్పటికే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఇంకొంచెం ఉత్తమంగా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేదనిపించింది’’ అని చాహల్ వెల్లడించాడు.
రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ!
టెస్టు ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తరువాత పలువురు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆయన నిర్ణయంపై ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడి వల్లే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ ఆరోపణలను మాజీ టీమ్ మేనేజర్ శ్రిధర్ స్పష్టంగా ఖండించారు. “రోహిత్ స్వేచ్ఛతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి గంభీర్‌కి సంబంధమే లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే,” అని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్యానికి చేరుకుంటున్న వయస్సు, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన వివరించారు. “తనపై ఉన్న బాధ్యతను తీర్చుకున్నట్టు రోహిత్ భావించాడు. ఓ లెజెండరీ కెప్టెన్ గౌరవంగా ఆటకు వీడ్కోలు చెప్పాడు,” అని మాజీ మేనేజర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రోహిత్ రిటైర్మెంట్పై నెలకొన్న అనుమానాలకు కొంత మేర స్పష్టత వచ్చింది. గత టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్న అతడు 2027 ప్రపంచకప్‌పై దృష్టిసారించాడు. వన్డే ప్రపంచకప్‌ను నెగ్గి తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనేదే అభిమానుల ఆకాంక్ష.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com