CHAHAL: మోసగాడు అన్నారు.. చనిపోదామనుకున్నా

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శల గురించి తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో చాహల్ మాట్లాడాడు. కొందరు తనపై మోసగాడి ముద్ర వేశారని ఈ సందర్భంగా చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2020లో వివాహం చేసుకున్న వీరిద్దరూ తమ బంధానికి ఇటీవలే ముగింపు పలికారు. విడాకుల తర్వాత తాను చాలా విమర్శలు ఎదుర్కొన్నానని తాజాగా చాహల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొందరు తనను ‘మోసగాడు’ అంటూ లేబుల్ వేశారని.. కొన్నిసార్లు సూసైడ్ ఆలోచనలూ వచ్చాయని తెలిపాడు.
ఆత్మహత్య ఆలోచనలు..
"నా వ్యక్తిగత జీవితంపై వచ్చిన కథనాలు చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయే వాడిని. ఇలా 45 రోజులు గడిచాయి. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఏ విషయంపైనా ధ్యాస పెట్టలేకపోయాను. సుమారు ఐదు నెలల పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. కొన్నిసార్లు నా అత్యంత సన్నిహిత మిత్రుడితో ఆత్మహత్య ఆలోచనలు కూడా పంచుకున్నాను. అది నిజంగా భయానకమైన అనుభవం" అని చాహల్ ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల గురించి ఎక్కువగా స్నేహితులతోనే చర్చించేవాడిని. కుటుంబసభ్యుల్లో అనవసరమైన టెన్షన్‌ను తీసుకురావడం నాకిష్టం ఉండదు. ప్రాతిక్ పవార్, ఆర్జే మహ్వషాతోపాటు ఇతర స్నేహితులతో పంచుకొనేవాడిని. వారివల్లే మళ్లీ మామూలు మనిషిగా తయారయ్యా. ఇప్పుడూ వారంతా నాతోనే ఉన్నారు’’ అని భారత క్రికెటర్ వెల్లడించాడు. "మేమిద్దరం కూడా మా కెరీర్లో విజయాన్ని సాధించాలనుకున్నాం. ఆ కారణంగా వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వడం కష్టంగా మారింది. అప్పుడు రాజీ పడడం తప్ప ఇతర మార్గం ఉండదు. కానీ రెండు వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే ఆ ప్రభావం రిలేషన్‌పై పడక తప్పదు. కెరీర్ కీలక దశలో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలవడం అత్యంత అవసరం" అని చాహల్ వివరించాడు.
‘నేను విడాకులు తీసుకున్నాక.. చాలా విమర్శలు ఎదుర్కొన్నా. మోసగాడంటూ కామెంట్లు చేశారు. మహిళలను గౌరవించడం రాదంటూ ఆరోపించారు. కానీ, నాకూ ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారితో కలిసి పెరిగా. మహిళలను ఎలా గౌరవించాలనేది నాకు తెలుసు. నా తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పించారు. అలాగే చుట్టుపక్కల వారి నుంచీ చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటా. అయితే, నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. కేవలం వారి వ్యూస్ కోసమే ఇదంతా చేశారు. నా వ్యక్తిగత జీవితం గురించి స్క్రూటినీ చేసినప్పుడు తీవ్ర ఆందోళన చెందా. రోజులో కేవలం 2 గంటలే నిద్ర పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా దాదాపు 45 రోజులపాటు కంటిమీద కునుకు లేదు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్నా. ఏ విషయం పైనా ఏకాగ్రత పెట్టలేకపోయా. ఐదు నెలలపాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యా. నా స్నేహితుడితో కొన్నిసార్లు ఆత్మహత్మ ఆలోచనలూ షేర్ చేసుకున్నా. చాలా భయమేసింది’’ అని చాహల్ వ్యాఖ్యానించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com