CWC 2023: పాక్‌పై పంజా విసిరిన అఫ్గాన్

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌పై అప్ఘానిస్థాన్ సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్... ఇప్పుడు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (17: 22 బంతుల్లో, రెండు ఫోర్లు)... శుభారంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కేవలం 10.1 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని అజ్మతుల్లా విడదీశాడు.
అబ్దుల్లా షఫీక్ రెండో వికెట్‌కు బాబర్ ఆజంతో (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించింది. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అబ్దుల్లా షఫీక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు. రాగానే సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన మహ్మద్ రిజ్వాన్ (8: 10 బంతుల్లో, ఒక సిక్సర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 92 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులతో రాణించాడు. సాద్ షకీల్ 25, ఇమామ్ ఉల్ హక్ 17, మహ్మద్ రిజ్వాన్ 8 పరుగులే చేశారు. షాదాబ్ ఖాన్ 38 బంతుల్లో 40 పరుగులతో నిలకడగా ఆడగా.. ఇఫ్తికార్ అహ్మద్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 40 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబీకి ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను సాధికారికంగా ప్రారంభించింది. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు,1 సిక్స్‌లతో 65, ఇబ్రహీం జాద్రాన్ 87 బంతుల్లో 9 ఫోర్లతో 74 పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహ్మత్ షా 84 బంతుల్లో 77, హష్మాతుల్లా షాహిది 45 బంతుల్లో 48లతో నిలకడగా ఆడారు. ఇబ్రహీం జద్రాన్ అవుటైనా... రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. వీరు మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. పాక్ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com