SURESH RAINA: చెఫ్‌గా మారిన సురేష్ రైనా..

మాజీ భారత క్రికెట్ ఆటగాడు, చైనా సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడైన సురైష్ రైనా నెదర్లాండ్స్‌లో సందడి చేయనున్నాడు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో నూతనంగా ఇండిన్ రెస్టారెంట్‌ను ప్రారంభించి భారతీయ వంటకాల రుచుల్ని అందించనున్నాడు. సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే రైనా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
"నాకు ఫుడ్, వంట పట్ల ఉన్న ఆసక్తికి ఆమ్‌స్టర్‌డాం వేదిక కాబోతుంది. ఇక్కడ రైనా ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని రుచుల్ని యూరప్‌కు దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చాను. మా రెస్టారెంట్లో జరిగే అప్‌డేట్స్, నోరూరించే రుచుల కోసం ఎదురుచూస్తుండండి " అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడ.
ఈ బిజినెస్‌కు ముందు రైనా బేబీ ఉత్పత్తులను విక్రయించే 'మేట్' అనే కంపెనీని కూడా ప్రారంభించాడు. దీనితో పాటు 'సాహికాయిన్' అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాడు.
భారత మాజీ కెప్టెన్ ధోనీకి సన్నిహిత మిత్రుడు, CSK టీం సహచరుడు అయిన రైనా, 2020 లో క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటలకే తను కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగిన రైనా, సెప్టెంబర్ 2022లో మెగా టోర్నీకి కూడా గుడ్‌బై చెప్పాడు. తాజాగా లంక ప్రీమియర్‌లో ఆడేందుకు రైనా తన పేరును రిజిష్టర్ చేసుకున్నాడు.
సురైష్ రైనా భార్య ప్రియాంక గతంలో ఆమ్‌స్టర్‌డామ్‌ంలో పనిచేసినందున రైనా కూడా అక్కడే నూన రెస్టారెంట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com