CRICKET: రిటైర్‌మెంట్ ప్రకటిస్తే రూ.58 కోట్లు

CRICKET: రిటైర్‌మెంట్ ప్రకటిస్తే రూ.58 కోట్లు
X
ఆస్ట్రేలియా క్రికెటర్లకు బంపర్ ఆఫర్... హెడ్, కమిన్స్‌కు ఐపీఎల్ ప్రాంఛైజీ ఆఫర్.. చెరో రూ. 58 కోట్లు ఇస్తామంటూ చర్చలు

టీ20ల రా­క­‌­తో క్రి­కె­ట్ స్వ­‌­రూ­ప­‌­మే మా­రి­పో­యిం­ది. పొ­ట్టి ఫా­ర్మా­ట్‌­ను చూ­సేం­దు­కు ప్రే­క్ష­‌­కు­లు ఎక్కు­వ­‌­గా ఇష్ట­‌­ప­‌­డు­తుం­డ­‌­డం­తో ప్ర­‌­పంచ వ్యా­ప్తం­గా టీ20 లీ­గు­లు పు­ట్ట­గొ­డు­గు­ల్లా పు­ట్టు­కొ­చ్చా­యి. జా­తీయ జ‌­ట్ట­‌­కు ప్రా­తి­ని­ధ్యం వ‌­హి­స్తే వ‌­చ్చే న‌­గ­‌­దు­తో పో­లి­స్తే ఫ్రాం­ఛై­జీ క్రి­కె­ట్‌­లో­నే ఆట­‌­గా­ళ్లు చాలా ఎక్కువ మొ­త్తా­ల­‌­నే అం­దు­కుం­టు­న్నా­రు. ఈ క్ర­‌­మం­లో కొం­ద­‌­రు ఆట­‌­గా­ళ్లు అం­త­‌­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు గు­డ్‌­బై చె­ప్పే­సి ఏడా­ది పొ­డు­వు­నా టీ20 లీ­గు­లు ఆడు­తూ భారీ మొ­త్తం­లో­నే సం­పా­ది­స్తు­న్నా­రు. ని­కో­ల­స్ పూ­ర­న్, హె­న్రి­చ్ క్లా­సె­న్ వంటి ఆట­‌­గా­ళ్లు ఈ కో­వ­‌­కే చెం­దు­తా­రు. దీ­ని­పై ఇప్ప­‌­టి­కే మాజీ క్రి­కె­ట­‌­ర్లు ఆం­దో­ళ­‌న వ్య­‌­క్తం చే­స్తు­న్న సం­గ­‌­తి తె­లి­సిం­దే. అయి­తే తా­జా­గా ఓ వా­ర్త క్రి­కె­ట్ ప్ర­పం­చా­న్ని ఆశ్చ­ర్యా­ని­కి గు­రి­చే­సిం­ది. ఓ ఐపీ­ఎ­ల్ ఫ్రాం­ఛై­జీ ఆస్ట్రే­లి­యా కె­ప్టె­న్ పాట్ క‌­మి­న్స్‌­తో పాటు స్టా­ర్ ఓపె­న­‌­ర్ ట్రా­వి­స్ హె­డ్‌­ల­‌­కు భారీ మొ­త్తా­న్ని ఆఫ­‌­ర్ చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. సం­వ­‌­త్స­‌­రా­ని­కి ఒక్కొ­క్క­‌­రి­కి 10 మి­లి­య­న్ ఆస్ట్రే­లి­య­న్ డా­ల­ర్లు (భా­ర­‌త క‌­రె­న్సీ­లో సు­మా­రు రూ. 58 కో­ట్లు) ఆఫర్ చే­సి­న­‌­ట్లు కూడా తె­లు­స్తోం­ది. ఈ మొ­త్తా­న్ని పొం­దా­లం­టే ఆ ఆట­‌­గా­ళ్లు అం­త­‌­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు రి­టై­ర్‌­మెం­ట్ ప్ర­‌­క­‌­టిం­చా­ల్సి ఉం­టుం­ది. వా­రి­ద్ద­‌­రు ఐపీ­ఎ­ల్‌­లో మా­త్ర­‌­మే కా­కుం­డా త‌మ ఫ్రాం­ఛై­జీ­కి చెం­దిన జ‌­ట్ల త‌­రు­పున ఇత‌ర లీ­గు­ల్లో­నూ ఆడా­ల్సి ఉం­టుం­ద­‌­ట‌. అయి­తే.. దీ­ని­పై ప్ర­‌­స్తు­తా­ని­కి క‌­మి­న్స్‌, హె­డ్‌­లు ఎలాం­టి ని­ర్ణ­‌­యం తీ­సు­కో­లే­ద­‌­ని తె­లు­స్తోం­ది. అయితే వీరిద్దరూ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.

గిట్టుబాటే కానీ..

రూ.58 కో­ట్ల­ను అం­దు­కో­వా­లం­టే కమి­న్స్, హెడ్ అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ కు వీ­డ్కో­లు పలి­కి కే­వ­లం తమ లీగ్ లోనే ఆడా­ల­ని ఆ ఐపీ­ఎ­ల్ ప్రాం­ఛై­జీ షర­త్తు వి­ధిం­చిం­ది. ఆస్ట్రే­లి­యా క్రి­కె­ట్‌ నుం­చి వీ­రి­ద్ద­రూ బయ­ట­కు రా­వా­ల్సి ఉం­టుం­ది. కే­వ­లం ఐపీ­ఎ­ల్‌­లో మా­త్ర­మే కా­కుం­డా.. తమ ఫ్రాం­చై­జీ­కి చెం­దిన జట్ల తర­ఫున ఇతర టీ20 లీ­గు­ల్లో­నూ ఆడా­ల్సి­ఉం­ది. జా­తీయ జట్టు తర­ఫున ఆడ­కుం­డా.. ఫ్రాం­చై­జీ­కి వస్తు­న్నం­దు­కే ఇంత భారీ మొ­త్తం చె­ల్లిం­చేం­దు­కు సి­ద్ధ­మై­న­ట్లు తె­లు­స్తోం­ది. ఏడా­ది పొ­డ­వు­నా లీ­గు­లు ఉం­డ­టం­తో ఫ్రాం­చై­జీ­కీ ఆ ధర బా­గా­నే వర్కౌ­ట్‌ అవు­తుం­ద­నే­ది క్రి­కె­ట్ వర్గాల అం­చ­నా.

తిరస్కరించిన హెడ్, కమిన్స్ ?

ఈ ఆఫ­ర్‌­ను కమి­న్స్‌, హె­డ్‌ ఇద్ద­రూ తి­ర­స్క­రిం­చా­ర­ని తె­లు­స్తోం­ది. దేశం కంటే తమకు డబ్బు ము­ఖ్యం కా­ద­ని సదరు ఫ్రాం­చై­జీ యా­జ­మా­న్యా­ని­కి తే­ల్చి చె­ప్పా­రట. ఈ వి­ష­యా­న్ని​ ఆసీ­స్‌ మీ­డి­యా కొ­న్ని రో­జు­లు­గా హై­లై­ట్‌ చే­స్తుం­ది. సో­ష­ల్‌­మీ­డి­యా­లో సైతం పె­ద్ద ఎత్తున ‍ప్ర­చా­రం చే­సు­కుం­టుం­ది. దేశం పట్ల కమి­న్స్‌, హె­డ్‌­కు ఉన్న అం­కి­త­భా­వా­న్ని కొ­ని­యా­డు­తు­న్నా­రు. సా­ధా­ర­ణం­గా ఆస్ట్రే­లి­యా ఆట­గా­ళ్ల­కు దేశం తర­ఫున ఆడి­తే ఏడా­ది­కి 1.5 మి­లి­య­న్‌ డా­ల­ర్ల­కు మిం­చి రావు. అలాం­టి­ది కమి­న్స్‌, హె­డ్‌ ఇంత భారీ ఆఫ­ర్‌­ను ఎలా కా­ద­ను­కు­న్నా­ర­ని కొం­ద­ర­ను­కుం­టు­న్నా­రు.

Tags

Next Story