MCC: క్రికెట్‌ నిబంధనల్లో ఏకంగా 73 మార్పులు

MCC: క్రికెట్‌ నిబంధనల్లో ఏకంగా 73 మార్పులు
X
క్రికెట్‌ నిబంధనల్లో ఎంసీసీ భారీ మార్పులు... మరింత ఆకర్షణీయంగా ఎంసీసీ నిబంధనలు... ఏకంగా 73 మార్పులు తీసుకొచ్చిన ఎంసీసీ

ఆధు­నిక క్రి­కె­ట్‌ వే­గం­గా మా­రు­తు­న్న నే­ప­థ్యం­లో ఆటను మరింత ఉత్కం­ఠ­భ­రి­తం­గా, స్ప­ష్టం­గా మా­ర్చే ది­శ­గా కీలక అడు­గు­లు పడు­తు­న్నా­యి. ప్ర­పంచ క్రి­కె­ట్‌­కు నియమ ని­బం­ధ­న­లు రూ­పొం­దిం­చే ప్ర­తి­ష్టా­త్మక సం­స్థ మెల్ బో­ర్న్ క్రి­కె­ట్ క్ల­బ్ (ఎం­సీ­సీ) క్రి­కె­ట్‌ చట్టా­ల్లో వి­స్తృత స్థా­యి­లో మా­ర్పు­లు ప్ర­తి­పా­దిం­చిం­ది. మొ­త్తం 73 అం­శా­ల్లో సవ­ర­ణ­లు సూ­చి­స్తూ, కా­లా­ను­గు­ణం­గా ఆట స్వ­రూ­పం మా­రా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని స్ప­ష్టం చే­సిం­ది. ఈ కొ­త్త ని­బం­ధ­న­లు ఈ ఏడా­ది అక్టో­బ­రు నుం­చి అధి­కా­రి­కం­గా అమ­ల్లో­కి రా­ను­న్నా­యి. క్రి­కె­ట్‌­లో ఉత్కం­ఠ­ను పెం­చ­డం, ఆట­లో­ని అన­వ­సర ఆల­స్యా­ల­ను తగ్గిం­చ­డం, అలా­గే ని­య­మాల అమ­లు­లో పా­ర­ద­ర్శ­కత తీ­సు­కు­రా­వ­డ­మే ఈ మా­ర్పుల ప్ర­ధాన లక్ష్య­మ­ని ఎం­సీ­సీ పే­ర్కొం­ది. గత కొ­న్నే­ళ్లు­గా క్రి­కె­ట్‌ అభి­మా­ను­లు, ఆట­గా­ళ్లు, అం­పై­ర్ల నుం­చి వచ్చిన సూ­చ­న­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కు­ని ఈ మా­ర్పు­లు రూ­పొం­దిం­చి­న­ట్లు సం­స్థ వె­ల్ల­డిం­చిం­ది. ము­ఖ్యం­గా సు­దీ­ర్ఘ ఫా­ర్మా­ట్‌­ల­లో ఆట సాగే వి­ధా­నం­లో కీ­ల­క­మైన మా­ర్పు­లు చో­టు­చే­సు­కు­న్నా­యి.

టె­స్టు, ఫస్ట్‌­క్లా­స్‌ మ్యా­చ్‌­ల్లో ఇప్ప­టి­వ­ర­కు అమ­లు­లో ఉన్న ఓ సం­ప్ర­దా­యా­ని­కి ఎం­సీ­సీ ము­గిం­పు పలి­కిం­ది. ఆఖరి ఓవ­ర్లో వి­కె­ట్‌ పడి­తే, ఆ రోజు ఆటను అక్క­డి­తో ని­లి­పి­వే­య­డం సా­ధా­ర­ణం­గా జరు­గు­తూ వచ్చిం­ది. వి­కె­ట్‌ పడిన వెం­ట­నే కొ­త్త బ్యా­ట­ర్‌ క్రీ­జు­లో­కి రా­క­పో­వ­డం వల్ల ఆటలో ఉత్కంఠ తగ్గి­పో­తుం­ద­ని వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో ఇకపై ఆఖరి ఓవ­ర్లో వి­కె­ట్‌ పడి­నా మి­గి­లిన బం­తు­లు తప్ప­ని­స­రి­గా వే­యా­ల­నే ని­ర్ణ­యా­ని­కి ఎం­సీ­సీ వచ్చిం­ది. దీ­ని­వ­ల్ల ఆట చి­వ­రి క్ష­ణాల వరకు అభి­మా­ను­ల­కు ఆస­క్తి కొ­న­సా­గు­తుం­ద­ని భా­వి­స్తోం­ది. మహి­ళల క్రి­కె­ట్‌, జూ­ని­య­ర్‌ క్రి­కె­ట్‌­కు సం­బం­ధిం­చి కూడా ఎం­సీ­సీ కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­ది. ఇప్ప­టి­వ­ర­కు బం­తుల పరి­మా­ణాల వి­ష­యం­లో స్ప­ష్టత లే­క­పో­వ­డం­తో, వి­విధ దే­శా­ల్లో భి­న్న­మైన ప్ర­మా­ణా­లు అమ­లు­లో ఉం­డే­వి.

ఈ గం­ద­ర­గో­ళా­న్ని తొ­ల­గిం­చేం­దు­కు బం­తుల పరి­మా­ణా­ల­ను మళ్లీ ని­ర్వ­చిం­చిం­ది. వీ­టి­ని సై­జ్‌ 1, సై­జ్‌ 2, సై­జ్‌ 3గా వర్గీ­క­రిం­చిం­ది. పు­రు­షుల క్రి­కె­ట్లో ఉప­యో­గిం­చే సై­జ్‌ 1 బం­తి­లో ఎలాం­టి మా­ర్పు చే­య­లే­దు. అయి­తే మహి­ళ­లు, జూ­ని­య­ర్‌ క్రి­కె­ట­ర్ల కోసం ఉప­యో­గిం­చే బం­తుల నా­ణ్యత, ప్ర­మా­ణా­లు మరింత మె­రు­గు­ప­డే­లా చర్య­లు తీ­సు­కుం­ది. క్రి­కె­ట్‌ సా­మ­గ్రి ఖర్చు­లు పె­రు­గు­తు­న్న నే­ప­థ్యం­లో బ్యా­ట్ల వి­ష­యం­లో­నూ కీలక సడ­లిం­పు­లు ప్ర­క­టిం­చిం­ది. ఒకే చె­క్క ము­క్క­తో తయా­ర­య్యే సాం­ప్ర­దాయ వి­ల్లో బ్యా­ట్ల ధరలు భా­రీ­గా పె­ర­గ­డం వల్ల, ము­ఖ్యం­గా యువ క్రి­కె­ట­ర్లు ఆర్థిక భారం ఎదు­ర్కొం­టు­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో ఒకటి కంటే ఎక్కువ చె­క్క ము­క్క­ల­ను అతి­కిం­చి తయా­రు­చే­సే ‘ల్యా­మి­నే­టె­డ్‌ బ్యా­ట్ల’ వా­డ­కా­ని­కి అను­మ­తి ఇచ్చిం­ది. దీని ద్వా­రా దే­శ­వా­ళీ, క్ల­బ్‌ స్థా­యి­లో ఆడే ఆట­గా­ళ్ల­కు ఖర్చు తగ్గు­తుం­ద­ని ఎం­సీ­సీ అభి­ప్రా­య­ప­డు­తోం­ది. అయి­తే అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో మా­త్రం ఇప్ప­టి­లా­గే సిం­గి­ల్‌ వి­ల్లో బ్యా­ట్లే కొ­న­సా­గే అవ­కా­శం ఉం­ద­ని స్ప­ష్టం చే­సిం­ది.

వికెట్‌కీపింగ్‌ నిబంధనల్లోనూ కొంత వెసులుబాటు కల్పించింది. బౌలర్‌ రన్‌అప్‌ ప్రారంభించిన సమయంలో వికెట్‌కీపర్‌ గ్లోవ్స్‌ స్టంప్స్‌ కంటే ముందుకు వచ్చినా ఇకపై జరిమానా విధించబోమని ప్రకటించింది. అయితే బౌలర్‌ బంతిని విడిచే సమయంలో మాత్రం కీపర్‌ పూర్తిగా స్టంప్స్‌ వెనుకే ఉండాలనే నిబంధనను కొనసాగించింది. ఈ మార్పుతో ఆట వేగం పెరుగుతుందని, అనవసర వివాదాలు తగ్గుతాయని అంపైర్లు భావిస్తున్నారు. ఎంసీసీ ప్రతిపాదించిన ఈ 73 మార్పులు క్రికెట్‌ ఆటను మరింత ఆధునికంగా మార్చే దిశగా కీలకంగా మారనున్నాయి.

Tags

Next Story