విమానంలో ప్రమాదవశాత్తూ నీటికి బదులు విషం తాగిన క్రికెటర్..

విమానంలో ప్రమాదవశాత్తూ నీటికి బదులు విషం తాగిన క్రికెటర్..
భారత జట్టు ఆటగాడు మరియు కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మంగళవారం ఐసియులో చేరారు.

భారత జట్టు ఆటగాడు మరియు కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మంగళవారం ఐసియులో చేరారు. మయాంక్ విమానంలో ప్రమాదవశాత్తూ నీటికి బదులుగా విషం తాగాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించడంతో త్రిపురలోని ఆసుపత్రిలో చేర్పించారు. నివేదికల ప్రకారం, మయాంక్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది.

పోలీసులు కేసు నమోదు చేశారు

ఈ విషయమై మయాంక్ అగర్వాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మయాంక్ అగర్వాల్ విమానంలో కూర్చున్నప్పుడు, అతని ముందు బాటిల్ ఉన్న బ్యాగ్ ఉందని చెప్పారు. అందులో విషం ఉన్నా వాటర్ బాటిల్ అనుకుని మయాంక్ తాగాడు. ఆ తర్వాత మయాంక్ ముఖం వాచిపోయి నోటిలో బొబ్బలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

కర్ణాటక జట్టు తమ తదుపరి రంజీ మ్యాచ్ కోసం త్రిపుర నుండి ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న కారణంగా విమానం టేకాఫ్ కాలేదు. కర్ణాటక జట్టు తదుపరి మ్యాచ్‌ రైల్వేస్‌తో జరగనుంది.

మయాంక్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతడు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బ. ఇప్పటి వరకు మయాంక్ నాలుగు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. అయితే తమ కెప్టెన్ లేకపోవడంతో కర్ణాటక జట్టు రాజ్‌కోట్ చేరుకుని తమ తదుపరి మ్యాచ్‌కు సిద్ధమైంది.

సెక్రటరీ మాట్లాడుతూ, 'మయాంక్ అగర్వాల్‌ను ఎమర్జెన్సీలో చేర్పించిన్నట్లు నాకు ఫోన్ వచ్చింది. సీటుపై ఉంచిన బాటిల్‌లోని నీళ్లు తాగడంతో నోరు మండింది. గొంతులో ఇబ్బంది వచ్చింది. బహుశా నీరు ఆమ్లంగా ఉండవచ్చు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ ముఖం వాచిపోయి మాట్లాడలేకపోయాడు. అతను బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావచ్చని తెలిపారు.

వివరణాత్మక విచారణ

నీటిలో విషపూరిత పదార్థం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మయాంక్ ఇండిగో ఫ్లైట్ 6E 5177లో కూర్చున్నాడు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే అసలు నిజం ఏంటో తెలుస్తుంది. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎవరైనా క్రికెటర్‌ని ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఎందుకంటే ఫ్లైట్‌లో ఉన్న మరే ఇతర సభ్యులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు.

Tags

Next Story