Cricketer Umesh Yadav: క్రికెటర్ ఉమేష్ యాదవ్ భార్య.. అందంలో అప్సరసలా: ఫ్యాన్స్ ఫిదా

Cricketer Umesh Yadav: ఉమేష్ యాదవ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావడంతో, అతను భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ఉమేష్ 2015 సంవత్సరంలో జరిగిన ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి క్రీడాకారుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
IPLలో, ఉమేష్ యాదవ్ KKR కోసం ఎంపిక చేయబడ్డాడు. ఉమేష్ యాదవ్ వృత్తి జీవితం గురించి అందరికీ తెలిసినప్పటికీ, కానీ అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఉమేష్ అతని భార్య తాన్యా వాధ్వా ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అతను తన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటాడు.
ఉమేష్, తాన్యలది ఓ అందమైన ప్రేమకథ.. తాన్యా వాధ్వా పంజాబీ కుటుంబానికి చెందినవారు. తాన్య ఢిల్లీలో జన్మించింది. 'కోల్‌కతా నైట్ రైడర్స్' ఆటగాడు ఉమేష్ 2010లో ఐపీఎల్ మ్యాచ్‌లో మొదటిసారి తాన్యా వాధ్వాను కలిశాడు. తాన్యా క్రికెట్‌కు పెద్ద అభిమాని. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఉమేష్‌ని కలిసే అవకాశం వచ్చింది ఆమెకు. అక్కడి నుంచే అతని జీవితంలో మార్పు రావడం మొదలైంది. వీరి మధ్య బంధం మరింత బలపడింది. మొదటి పరిచయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తన ప్రపంచాన్ని తాన్యా రంగులతో నింపుతుందని అప్పుడే అతడికి అనిపించింది. కొన్నేళ్లు డేటింగ్ చేసిన తర్వాత, వారిద్దరూ 2013 లో వివాహం చేసుకున్నారు. వారి జీవితంలోకి ఓ చిన్నారి కూడా వచ్చింది.
తాన్యా వాధ్వాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక ఉండేది. ఢిల్లీలో చదువు పూర్తి చేసిన తాన్యా ఫ్యాషన్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. ఆమె ఢిల్లీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఫ్యాషన్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com