PEHALGAM: ఉగ్రదాడిపై క్రీడాలోకం విచారం

PEHALGAM: ఉగ్రదాడిపై క్రీడాలోకం విచారం
X
పిరికిపంద చర్యగా అభివర్ణన... ఇలాంటి దాడులకు భయపడబోమని ప్రకటన

జమ్ము కశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇక భారత జట్టు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకూడదని పలువురు డిమాండ్ చేశారు. పాక్‌తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించడంలో మొహమాటం వద్దని భారత మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి పోస్ట్ చేశారు. అమాయక భారతీయులను హత్య చేయడమే పాకిస్తాన్ జాతీయ క్రీడలా కనిపిస్తోందని ఘాటుగా స్పందించారు.**

సిరాజ్ ఆగ్రహం

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా నివాళులర్పిస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన, విషాదకరమైన ఉగ్రవాద దాడి గురించి ఇప్పుడే చదివానని రాశారు. ఇది చాలా బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో అమాయక ప్రజలను చంపడం చాలా దుర్మర్గమైన, అమానుషమైన చర్య అని.. ఏ కారణం లేదా ఆలోచన అటువంటి క్రూరమైన చర్యను సమర్థించదని సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.**

మతం పేరుతో చంపడం తప్పు- మహ్మద్ షమీ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఈ పిరికి చర్యపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. "పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి గురించి ఇప్పుడే చదివాను. మతం పేరుతో అమాయకులను చంపడం పూర్తిగా తప్పు" అని షమీ పోస్ట్ చేశాడు.****

* దాడి గురించి వినగానే నా గుండె పగిలింది. వయలెన్స్‌కు దేశంలో చోటు లేదు: గిల్**

* *అమాయకులపై ఉగ్రదాడి ఎంతో బాధను కలిగిస్తోంది: సెహ్వాగ్*

* బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ దాడిని ఊహించడానికే కష్టంగా ఉంది: ఆకాశ్ చోప్రా

* బాధితుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా: యువరాజ్

* ”కశ్మీర్​లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి విని తీవ్రంగా బాధపడ్డాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తున్నా. వారు ధైర్యంగా ఉండాలని ప్రారిస్థున్నా” — కెఎల్​ రాహుల్

* ఒక అమాయకుడి ప్రాణం కోల్పోయిన ప్రతిసారీ మానవత్వం కోల్పోతుంది.నేను రెండు రోజుత క్రితం అక్కడే ఉన్నాను. ఈ బాధ మరింత దగ్గర అనిపిస్తుంది” — ఇర్ఫాన్​ పఠాన్

Tags

Next Story