RONALDO-AL NASAR : రొనాల్డో క్లబ్‌ని నిషేధించిన ఫిఫా

సాకర్ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Christiano Ronaldo) ప్రాతినిధ్యం వహిస్తున్న సౌదీ లీగ్ ప్రో క్లబ్ అల్ నాజర్(Al Nazar) చిక్కుల్లో పడింది. ఆ జట్టు ఇక కొత్త ఆటగాల్లని తీసుకోకూడదని నిషేధం విధించింది. జట్టుకు చెందిన ఒక ఆటగాడికి ఫీజు చెల్లింపుల్లో విఫలం చెందినందున ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్‌కి చెందిన మాజీ ఆటగాడు అహ్మద్ మూసా లీసెస్టర్ క్లబ్ నుంచి అల్‌నాజర్ జట్టులో 2018లో 18 వమిలియన్ డాలర్ల చెల్లింపు ఒప్పందం ప్రకారం చేరాడు. 20220లో ఆ జట్టు తరపున కప్ కూడా గెలిచాడు. అయితే ఒప్పందం ప్రకారం అతని ప్రదర్శన ఆధారంగా పాత క్లబ్ లీసెస్టర్‌కి 3.9 లక్షల యూరోలు చెల్లించాల్సి ఉండగా అది చెల్లించకపోవడంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. మూసా క్లబ్ తరపున 58 మ్యాచుల్లో 11 గోల్స్ చేశాడు. 2021లోనే ఈ విషయంపై క్లబ్‌ని హెచ్చరించింది. 3 ట్రాన్స్‌ఫర్ విండోలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. క్లబ్‌కి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్ ఫండ్ నిషేధాన్ని తొలగించుకోడానికి అవసరమైన ఫీజు చెల్లిస్తామని స్పష్టం చేసింది.
అల్ నాజర్ క్లబ్ ఇటీవలే ఇంటర్ మిలన్ క్లబ్ ఆటగాడు బ్రోజోవిక్‌ని భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. స్టార్ ఆటగాడు రొనాల్డో ఈ సంవత్సరం జనవరిలో అల్ నాజర్ క్లబ్‌తో సంవత్సరానికి 200 మిలియన్ డాలర్లు చెల్లించేలా రికార్డ్ స్థాయి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌లో జట్టు తరఫున 16 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 14 గోల్స్ చేశాడు. కానీ జట్టుకు ఈ సీజన్ కప్ అందించలేకపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com