Cristiano Ronaldo: హెడర్ గోల్ అద్భుతః; రికార్డుల మోతెక్కిస్తోన్న రొనాల్డో

Cristiano Ronaldo: హెడర్ గోల్ అద్భుతః; రికార్డుల మోతెక్కిస్తోన్న రొనాల్డో
145 హెడర్ గోల్స్‌తో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక హెడర్ గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 144 హెడర్ గోల్స్‌తో గెరార్డ్ ముల్లర్ పేరు మీద ఉండేది. అలాగే తన కెరీర్‌లో ఇది 839వ గోల్‌ నమోదు చేశాడు.

క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న సౌదీ లీగ్ జట్టు అల్ నాజర్ జట్టు వరుస ఓటముల తర్వాత విజయం సాధించింది. మంగళవారం వారం జరిగిన అరబ్ క్లబ్ ఛాంపియన్స్ కప్‌లో 4-1 గోల్స్ తేడాతో యూఎస్ మొనాస్టిర్‌పై విజయం సాధించింది. క్రిస్టియానో రొనాల్డో కూడా ఒక హెడర్ గోల్ కొట్టి విజయంలో పాలు పంచుకున్నాడు.

తనకు అలవాటైన స్టైల్‌లో ఓ హెడర్ ద్వారా గోల్ కొట్టి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దీంతో పాటు పలు రికార్డులూ నమోదు చేశాడు. 145 హెడర్ గోల్స్‌తో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక హెడర్ గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 144 హెడర్ గోల్స్‌తో గెరార్డ్ ముల్లర్ పేరు మీద ఉండేది. అలాగే తన కెరీర్‌లో ఇది 839వ గోల్‌ నమోదు చేశాడు.

యూరోపియన్ క్లబ్‌లైన బెనిఫీసియా, సెల్టా విగోలోతో ఓటముల తర్వాత ఆ జట్టుకు ఈ సీజన్‌లో ఇదే మొదటి విజయం. 42వ నిమిషంలో ఆ జట్టు తరపున తాలిస్కా మొదటి గోల్ చేశాడు. అనంతరం అల్ నాజర్ జట్టు డిఫెండర్ తప్పిదం చేయడంతో వారి గోల్‌లోకే బంతిని పంపి ప్రత్యర్థికి 1 గోల్ సమర్పించుకున్నారు. దీంతో స్కోర్ 1-1తో సమం అయింది. దూకుడుగా ఆడిన అల్ నాజర్ జట్టుకి క్రిస్టియానో రొనాల్డో 74వ నిమిషంలో ఓ అద్భుతమైన హెడర్‌తో గోల్ సాధించిపెట్టాడు.


ఆ తర్వాత ఆట మొత్తం అల్ నాజర్ వైపు మళ్లింది. ఆట చివరి 2 నిమిషాల్లో అబ్ధుల్లా అల్ అమ్రి(88'), అబ్ధులాజిజ్ సౌద్ అల్ ఇల్వాయిలు(90') గోల్స్‌ కొట్టడంతో 4-1 తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story