CT: ఆ స్టార్లకు ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్..!

CT: ఆ స్టార్లకు ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్..!
X
రోహిత్‌, విరాట్, జడేజాలకు చివరి అవకాశం... ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం దుబాయ్‌ చేరుకున్న టీమిండియా

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్, జడేజాలపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ICC ఈవెంట్ అని చోప్రా అభిప్రాయపడ్డారు. బరువెక్కిన హృదయంతో తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. తరచూ వస్తున్న రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో వీరు 2027 వన్డే WC వరకు కొనసాగకపోవచ్చని తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియా ఇప్పటికే దుబాయ్ చేరుకుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభంకానున్నది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో ఆడనుంది. భారత్‌కి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరుగుతాయి.

ఇంగ్లండ్‌పై అశ్విన్ ఫైర్

భారత్‌తో వన్డే, T20 సిరీస్‌లను కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టుపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రహం వ్యక్తం చేశాడు. ఓడిన ప్రతీసారి సాకులు చెప్పడం మానుకోవాలని హితవు పలికాడు. ఈ వరుస పరాజయాలు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. కాబట్టి విజయం కోసం పోరాడాలి తప్ప సాకులు వద్దంటూ అశ్విన్ సలహా ఇచ్చాడు.

మనం క్రీడాకారులం మాత్రమే: అశ్విన్

భారత క్రికెట్‌లో పెరుగుతున్న ‘సూపర్‌స్టార్‌’ సంస్కృతిపై మాజీ క్రికెటర్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో.. ‘భారత్ క్రికెట్‌లో పరిస్థితులన్నీ సాధారణంగా మార్చాలి. భారత జట్టులో సూపర్‌ స్టార్‌డమ్, సూపర్ సెలెబ్రిటీలను ప్రోత్సహించకూడదు. మేము యాక్టర్స్ లేదా సూపర్‌స్టార్స్ కాదు. మేము క్రీడాకారులం. సామాన్య ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారు మనతో పోల్చుకునేలా వ్యవహరించాలి’ అని చెప్పారు.

ఇంగ్లాండ్ క్రికెటర్ కుమారుడికి విరాట్ గిఫ్ట్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన జెర్సీని ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కుమారుడు డిలాన్‌కు బహుమతిగా పంపించారు. ఆ జెర్సీపై కోహ్లి ఆటోగ్రాఫ్‌తో పాటు 'టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్' అని రాసి ఉంది. ఈ విషయాన్ని కెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి 'నువ్వు పంపిన బహుమతి అందింది మిత్రమా.. అది డిలానుకు చక్కగా సరిపోయింది' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Tags

Next Story