CWG2030: అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్!

భారతదేశం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించేందుకు హోస్ట్ చేయడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన యూనియన్ కేబినెట్ మీటింగ్‌లో బిడ్ వేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిడ్ గెలిస్తే అహ్మదాబాద్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. అది కూడా గుజరాత్ సర్కార్‌కి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో సహా అన్ని సపోర్ట్‌లతో జరగనుంది. ఒకవేళ మన బిడ్ గెలిస్తే, హోస్ట్ కొలాబరేషన్ అగ్రిమెంట్ (HCA) కూడా సైన్ అవుతుంది. బిడ్ ఆమోదం పొందితే, గుజరాత్ ప్రభుత్వానికి సహకార ఒప్పందం, గ్రాంట్–ఇన్–ఎయిడ్ మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ క్రీడల సమయంలో దేశాన్ని పెద్ద సంఖ్యలో అథ్లెట్లు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, పర్యాటకులు, మీడియా వ్యక్తులు సందర్శించనున్నారు. దీంతో స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఆదాయం కూడా లభించనుంది.
అహ్మదాబాద్ ఎందుకు?
అహ్మదాబాద్‌లో వరల్డ్ క్లాస్ స్టేడియంలు, అత్యాధునిక ట్రైనింగ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ పట్ల ఉన్న ప్యాషన్ సహా అనేకం ఉన్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం కూడా ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. 2023లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ని సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేసిన ఈ స్టేడియం, కామన్వెల్త్ గేమ్స్ 2030కి కూడా రెడీగా ఉంది. ఇక్కడ అథ్లెట్లు, కోచ్‌లు, టెక్నికల్ ఆఫీసర్లు, టూరిస్టులు, మీడియా పర్సన్స్ సహా అందరూ ఒక చోట అందుబాటులో ఉంటారు.
"భారతదేశంలో కామన్వెల్త్ గేమ్స్‌ని నిర్వహించడం పర్యాటకాన్ని పెంచడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, లక్షలాది మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ ఆపరేషన్స్, మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్లు, బ్రాడ్కాస్ట్, మీడియా, IT, కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, ఇతర రంగాలలో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు” అని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. ఇండియాతో పాటు, నైజీరియా, మరో రెండు దేశాలు కూడా 2030లో బహుళ-క్రీడా మహోత్సవాన్ని నిర్వహించడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 2030 కామన్వెల్త్ క్రీడలకు తుది ఆతిథ్య దేశాన్ని నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది.
72 దేశాల నుంచి అథ్లెట్లు..
ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటారు. ఇది కేవలం స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ సెలబ్రేషన్ అని కూడా చెప్పవచ్చు. ఈ ఈవెంట్ వల్ల లోకల్ వ్యాపారాలకు కూడా మేలు జరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, టూరిజం... అన్నీ బూస్ట్ అవుతాయి. అంతేకాదు, ఈ ఈవెంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. స్పోర్ట్స్, సైన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, బ్రాడ్కాస్ట్, మీడియా, IT, కమ్యూనికేషన్స్... ఇలా ఎన్నో రంగాల్లో యువతకు అవకాశాలు దొరుకుతాయి. ఈ మెగా ఈవెంట్ ఉద్యోగ అవకాశాలను సృష్టించి, పర్యాటకాన్ని పెంచుతుందని, పెద్ద ఎత్తున జరిగే క్రీడా ఈవెంట్లకు సంబంధించిన రంగాలలో నిపుణుల వృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించి ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com