Russia-Ukrain: రష్యా, బెలారస్ క్రీడాకారులను నిషేధించిన చెక్ రిపబ్లిక్

Russia-Ukrain: రష్యా, బెలారస్ క్రీడాకారులను నిషేధించిన చెక్ రిపబ్లిక్

రష్యా, బెలారస్ క్రీడాకారులను తమ దేశంలోకి రాకుండా, తమ దేశంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనకుండా నిషేధించేలా చెక్ రిపబ్లిక్ ప్రభుత్వం చేసిన తీర్మానమే దీనికి నేపథ్యం. సదరు దేశాల క్రీడాకారుల వీసాలు రద్దు చేసే అధికారాన్ని కూడా ఈ తీర్మానం పోలీసులకు ఇచ్చింది. దీంతో ప్రేగ్ ఓపెన్‌లో పాల్గొనడానికి వచ్చిన రష్యా, బెలారస్ క్రీడాకారిణులకు చెక్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

రష్యాకు చెందిన ఎవ్‌జెనియా రోడినా, బెలారస్‌కు చెందిన అలియాక్సాండ్రా సస్నోవిచ్‌తో సహా పలువురు ఇతర ఆటగాళ్లను ఈవెంట్‌కు వెళ్లవద్దని నిర్వాహకులు సలహా ఇచ్చారు. గురువారం ఒక క్రీడాకారిణిని ఆడకుండా అడ్డుకున్నారు. టోర్నీలో పాల్గొనాలనుకునే ఇతర రష్యా, బెలారస్ క్రీడాకారిణులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు.

"స్థానిక ప్రభుత్వ నిర్ణయాలను టోర్నమెంట్ నిర్వాహకులు, యాజయాన్యం గౌరవిస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా, బెలారస్ పౌరసత్వం ఉన్న క్రీడాకారులు పాలుపంచుకోరని అనుకుంటున్నాం" అని టోర్నీ డైరెక్టర్ మిరోస్లోవ్ వెల్లడించాడు.

WTA ప్రేగ్ ఓపెన్ టెన్నిస్ పోటీల నుంచి రష్యా, బెలారస్ క్రీడాకారిణులను అనుమతించకపోవడంపై మహిళా టెన్నిస్ అసోసియేషన్(WTA) తీవ్రంగా స్పందించింది. క్రీడాకారులు, క్రీడాకారిణులను వివక్ష లేకుండా, ప్రతిభ ఆధారంగానే అనుమతించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X(ట్విట్టర్) లో ఒక ప్రకటన విడుదల చేసింది.

మధ్య, తూర్పు యూరప్‌ దేశాలతో రష్యా, బెలారస్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు అనుగుణంగా చెక్‌ రిపబ్లిక్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టినప్పటి నుంచి రష్యా పౌరులకు దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయడాన్ని నిలిపివేసింది. యూరప్‌లో బంధుత్వం ఉన్న వారికి మాత్రమే మానవతా ధృక్పతంతో స్పల్పకాలికానికి వీసాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.



Tags

Read MoreRead Less
Next Story