India vs Srilanka: వన్డే, టీ20 సిరీస్‌కు శ్రీలంక టీం ఎంపిక

Srilanka team File Photo
Srilanka Squad: జులై 18 నుంచి భారత్ -శ్రీలంక జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ లు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగే సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 24 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచులకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికానుంది. ఇటీవల ఇంగండ్‌లో పర్యటించిన లంకేయులను ఇంగ్లిష్ ఆటగాళ్లు వైట్‌వాష్ చేశారు. అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమై ఇంటిబాట పట్టిన శ్రీలంక బృందాన్ని కరోనా కలవర పెట్టింది.
కెప్టెన్ గా విఫలమైన కుశాల్ పెరీరాను సారథ్యబాద్యతల నుంచి తప్పించి దాసన్ శంకకు అప్పగించింది శ్రీలంక బోర్డు. అనూహ్యంగా ప్రాక్టీస్ సమయంలో గాయం కావడంతో కుశాల్ పెరీరా వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ బినుర ఫెర్నాండో కూడా గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వీరిద్దరూ జట్టుకు దూరం కావడంతో 24 మందితో కూడిన సవరించిన జట్టును శ్రీలంక బోర్డు తాజాగా ప్రకటించింది.
దసన్ షనక (కెప్టెన్), ధనంజయ డిసిల్వ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిండు హసరంగ, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, అషెన్ బండర, మినోద్ భానుక, లాహిరు ఉదార, రమేశ్ మెండిస్, చామిక కరుణరత్నే, దుష్‌మంత చమీరా, లక్షన్ సందకన్, అకిల ధనంజయ, షిరన్ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, కసున్ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదాన, ధనంజయ లక్షన్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయ విక్రమ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com