David Warner : 'శ్రీవల్లి' పాటకు వార్నర్ స్టెప్పులు

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌పై మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. ఇటీవలి వీడియో దీన్ని రుజువు చేస్తుంది. అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన PAK vs AUS వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్‌లో, వార్నర్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడం ద్వారా తెలుగు సినిమాపై తన ప్రేమను ప్రదర్శించాడు.
David Warner showcasing his dance moves in Pushpa song on the Rajiv Gandhi Stadium !
— Ahtasham Riaz (@AhtashamRiaz22) October 3, 2023
Warner + Pushpa + Crowd@davidwarner31#PAKvsAUS #PAKvAUS #WarmUpMatch #ICCCricketWorldCup pic.twitter.com/OAbvvhXh0d
తెలుగు సినిమాలకు, సూపర్ స్టార్ అల్లు అర్జున్‌కి అభిమానిగా పేరుగాంచిన వార్నర్, 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని పాపులర్ సాంగ్ 'శ్రీవల్లి' ట్యూన్‌లకు తన డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. ఈ ఆకర్షణీయమైన ట్రాక్ హుక్ స్టెప్‌కి వార్నర్ గాడి తప్పడం చూసి అభిమానులు నవ్వునాపులేకపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
I went straight to the stadium after finishing work early. Thanks, @davidwarner31, for the entertainment. #PAKvsAUS #CricketWorldCup2023" pic.twitter.com/XWTh6oxcQ6
— Aryan (@Aryan90007319) October 3, 2023
కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో అల్లు అర్జున్ హిట్ పాట 'బుట్టా బొమ్మ'కు తన కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా అభిమానులను ఆనందపర్చినప్పట్నుంచి వార్నర్‌కు తెలుగు సినిమాపై ఉన్న అభిమానం వెల్లడైంది. అప్పటి నుండి, ఆయన తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో వీడియోలను పంచుకునే వార్నర్.. తన ముఖాన్ని స్టార్‌లుగా మార్ఫింగ్ చేస్తూ కూడా అప్పట్లో వైరల్ అయ్యాడు. ముఖ్యంగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సహా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను సైతం ఆయన అనుకరించాడు.
'బాహుబలి'లో ప్రభాస్ దిగ్గజ పాత్ర నుండి 'సైరా నర్సింహారెడ్డి'లో చిరంజీవి పాత్ర వరకు, డేవిడ్ వార్నర్ వైరల్ వీడియోలు తెలుగు ప్రేక్షకులలో క్రేజ్‌ను తీసుకువచ్చాయి. ఇవి అతని క్రికెట్ రంగానికి ప్రత్యేకమైన టచ్ జోడించబడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com