David Warner:స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 17 సార్లు ఔటైన డేవిడ్‌వార్నర్

పేలవ ఫాంతో సతమతం అవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) 4వ టెస్టులో కూడా చోటు నిలుపుకున్నాడు. బుధవారం నుంచి యాషెస్ సిరీస్(Ashes Series)లోని 4వ టెస్ట్(4th Test) మాంచెస్టర్‌లో ఆరంభమవనుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా జట్టులో ఇతర టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణిస్తుండటంతో డేవిడ్ వార్నర్ ఫాం లేమి దృష్టిలో పడటం లేదు. చివరి మ్యాచ్‌లో రెండంకెల స్కోర్ చేయకుండానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్ ఒక్క స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లోనే 17 సార్లు ఔటవ్వడం విశేషం. వార్నర్ పూర్ ఫాంపై ఇంగ్లాండ్ అభిమానులు (England Fans)పాట కూడా క్రియేట్ చేశారు. పాట పాడుతూ అతడిని టీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం తనకు నచ్చుతుందని వెల్లడించాడు.బ్రాడ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.
"బ్రాడ్ నన్ను ఔట్ చేసినప్పుడు అభిమానులు నాపై పాట పాడతారు. అది నచ్చుతుంది. బ్రాడ్‌ని ఎదుర్కోవడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను. మా జట్టులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్ ఉన్నాం. అతను లెఫ్ట్ హ్యాండర్స్‌కి బౌలింగ్ వేయడంలో అత్యుత్తమ బౌలర్. గత కొన్ని సంవత్సరాలుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లకు అతను అద్భతంగా బౌలింగ్ చేశాడు. అతను చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. జేమ్స్ ఆండర్సన్(James Anderson) కూడా అద్భుతంగావేస్తాడు. వీరిద్దరితో చాలా కాలంగా ఆడుతూ వస్తున్నాం " అని అన్నాడు.
4వ టెస్ట్ ఆరంభమవనున్న ముందు రోజు వార్నర్ ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. నా స్నేహితులు, చుట్టూ ఉండే వారి సంఖ్య తగ్గినపుడు నా విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. నిజాయితీలోనే బలం ఉంటుంది, సంఖ్యలో కాదు అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com