IPL: ఢిల్లీ సూపర్ విజయం

IPL: ఢిల్లీ సూపర్ విజయం
X
సూపర్ ఓవర్‌లో ఓడిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్‌ 2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ సూపర్ ఓవర్ మ్యాచులో రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 11 పరుగులే చేయగా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ స్టార్క్ తన అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

మ్యాచ్ టై

అంతకుముందు చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగా రాజస్థాన్ ఛేదించింది. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు రావాల్సి ఉండగా... మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతికి రెండ పరుగులు రావడంతో చివరి మూడు బంతులకు అయిదు పరుగులు అవసరమయ్యాయి. నాలుగో బంతికి కూడా రెండు పరుగులు వచ్చాయి. దీంతో 2 బంతుల్లో మూడు పరుగులు కావాల్సి వచ్చింది. అయిదో బంతికి ఒక్క పరుగు వచ్చింది. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం దక్కనుంది. అయితే ఒకే పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది.

రాణించిన పోరెల్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ జట్టు తరపున అభిషేక్ పోరెల్ తో పాటు కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్(34), ట్రిస్టన్ స్టబ్స్(34*), అశుతోష్ శర్మ(15*) రాణించారు.

లక్ష్య ఛేదనలో..

ఛేదనలో ఢిల్లీ... రాజస్థాన్‌ను నిలువరించగలిగింది. సంజు శాంసన్‌ (31), జైస్వాల్‌ బ్యాట్‌ ఝళిపించడంతో ఆ జట్టు ఆరో ఓవర్లో 61/0తో నిలిచింది. శాంసన్‌ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 13 ఓవర్లలో 111/1తో నిలిచింది రాజస్థాన్‌. సాధించాల్సిన రన్‌రేట్‌ మాత్రం 11 దాటింది. తర్వాతి ఓవర్లోనే జైస్వాల్‌ను కుల్‌దీప్‌ను వెనక్కి పంపినా.. చెలరేగి ఆడిన రాణా రాయల్స్‌పై ఒత్తిడి పెరగకుండా చూశాడు. నితీశ్‌ జోరుతో రాజస్థాన్‌ లక్ష్యం దిశగా సాగింది. ఆ జట్టుకు చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు అవసరమయ్యాయి. కానీ 18వ ఓవర్లో రాణాను స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఆఖరి ఓవర్లో స్టార్క్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి అయిదు బంతుల్లో 1, 1, 2, 2, 1 పరుగులిచ్చాడు. ఆఖరి బంతికి రాజస్థాన్‌కు రెండు పరుగులు అవసరం కాగా.. డీప్‌ మిడ్‌వికెట్లోకి కొట్టిన జురెల్‌ ఒక్క పరుగే తీయగలిగాడు. రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతడు రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయింది. ఆట సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

Tags

Next Story