DC vs RR: రాజస్థాన్ పై ఢిల్లీ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే (86) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జాస్ బట్లర్ పెద్దగా పరుగులు చేయలేదు. రియాన్ పరాగ్, శుభం దూబే పరవాలేదనిపించారు ఆర్ఆర్ బ్యాటింగ్ లో పావెల్ , ఫెరీరా , అశ్విన్ , ట్రెంట్ బౌల్ట్ , అవేశ్ ఖాన్ పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, రశీక్ సలాం చెరో వికెట్ దక్కింది.
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్ (4), బట్లర్ (19) విఫలమయ్యారు. కానీ కెప్టెన్ శాంసన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. పరాగ్ (22 బంతుల్లో 27)తో కలిసి మూడో వికెట్‌కు 36 పరుగులు జోడించిన అతడు.. శుభమ్ దూబే (25) తో నాలుగో వికెట్‌కు 59 రన్స్ జతచేశాడు. 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసిన శాంసన్.. సలం వేసిన 13వ ఓవర్లో 6, 4, 6తో స్కోరువేగాన్ని పెంచాడు. దూబే కూడా గేర్ మార్చడంతో రాజస్థాన్ లక్ష్యం దిశగా సాగింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 63 పరుగులు అవసరమనగా.. ముకేశ్ 16వ ఓవర్లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో శాంసన్ పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ తడబడింది. మ్యాచ్‌లో ఇదే టర్నింగ్ పాయింట్. కుల్దీప్ ఒకే ఓవర్లో ఫెరెరా, అశ్విన్‌ను ఔట్ చేయడంతో రాయల్స్ ఓటమి ఖరారైంది. రాజస్థాన్ బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com