DHONI: ఐపీఎల్ బరిలోకి దిగేందుకు తలా సిద్ధం

DHONI: ఐపీఎల్ బరిలోకి దిగేందుకు తలా సిద్ధం
X
ధోనీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్... ఐపీఎల్ 2026లో బరిలో దిగనున్న ధోనీ... అధికారిక ప్రకటన చేసిన చెన్నై సీఈవో

టీ­మిం­డి­యా మాజీ సా­ర­థి, చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ప్లే­య­ర్ మహేం­ద్ర సిం­గ్ ధోనీ రి­టై­ర్మెం­ట్ పై గత కొం­త­కా­లం­గా జరు­గు­తు­న్న ప్ర­చా­రా­ని­కి తెర పడిం­ది. రా­బో­యే ఐపీ­ఎ­ల్ సీ­జ­న్ లో ధోనీ ఆడ­టం­పై ఆ జట్టు సీఈఓ కాశీ వి­శ్వ­నా­థ­న్ క్లా­రి­టీ ఇచ్చా­రు. ధోనీ మాతో మా­ట్లా­డా­రు.. ఆయన వచ్చే సీ­జ­న్‌­కి అం­దు­బా­టు­లో ఉం­టా­ర­ని తె­లి­పా­రు. 2008లో ఐపీ­ఎ­ల్ ప్రా­రం­భ­మైన నాటి నుం­చి ధోనీ చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్‌­కు వె­న్నె­ము­క­లాం­టి­వా­డు.. ఆయన నా­య­క­త్వం­లో సీ­ఎ­స్‌­కే ఐదు సా­ర్లు టై­టి­ల్ సా­ధిం­చి రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది అన్నా­రు. ఇక, 2025 ఐపీ­ఎ­ల్ సీ­జ­న్‌­లో సీ­ఎ­స్‌­కె జట్టు పా­యిం­ట్ల పట్టి­క­లో చి­వ­రి­స్థా­నం­లో ని­లి­చిం­ది.

ఇప్పటికే చర్చలు షురూ...

నవం­బ­ర్ 15న రి­టె­న్ష­న్ గడు­వు­కు ముం­దే ట్రే­డ్ చర్చ­లు ప్రా­రం­భ­మ­య్యా­యి. ఐపీ­ఎ­ల్ 2-026 సీ­జ­న్ కోసం ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చ­డా­ని­కి చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ నవం­బ­ర్ 10, 11 తే­దీ­ల­లో ఒక సమా­వే­శా­న్ని ని­ర్వ­హిం­చ­నుం­ది. సీ­ఈ­వో కాశీ వి­శ్వ­నా­థ్, కె­ప్టె­న్ రు­తు­రా­జ్ గై­క్వా­డ్, కోచ్ స్టీ­ఫె­న్ ఫ్లె­మిం­గ్ తో పాటు ధోనీ కూడా ఈ సమా­వే­శం­లో పా­ల్గొ­న­ను­న్నా­రు. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్ లో ఋతు­రా­జ్ గాయం కా­ర­ణం­గా టో­ర్నీ నుం­చి మధ్య­లో­నే తప్పు­కో­వ­డం­తో మి­గి­లిన మ్యా­చ్ లకు ధోనీ కె­ప్టె­న్సీ చే­శా­డు. ఐపీ­ఎ­ల్ 2008 లో చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ తర­పున ఆడు­తు­న్న ధోనీ మధ్య­లో రెం­డు సీ­జ­న్ (2016,2017)ల పాటు రై­జిం­గ్ పూణే సూ­ప­ర్‌­జె­యిం­ట్ తర­పున 30 మ్యా­చ్ లు ఆడా­డు. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో ధోని పె­ద్ద­గా రా­ణిం­చ­లే­దు. ఈ సీ­జ­న్ లో మొ­త్తం 14 మ్యా­చ్‌­ల్లో 24.50 సగ­టు­తో 196 పరు­గు­లు చే­శా­డు. 2020లో అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చిన ధోనీ.. గత సీ­జ­న్ లో రు­తు­రా­జ్ గై­క్వా­డ్ కు CSK కె­ప్టె­న్సీ­ని అప్ప­గిం­చా­డు.

జట్టు కూర్పుపై దృష్టి

ధోనీ అం­దు­బా­టు­లో ఉం­డ­టం ఖాయం కా­వ­డం­తో, చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఫ్రాం­చై­జీ రా­బో­యే ఐపీ­ఎ­ల్ 2026 కోసం తమ జట్టు కూ­ర్పు­పై దృ­ష్టి సా­రిం­చిం­ది. టీమ్ కె­ప్టె­న్ రు­తు­రా­జ్ గై­క్వా­డ్, కోచ్ స్టీ­ఫె­న్ ఫ్లె­మిం­గ్, సీఈఓ, ఇతర అధి­కా­రు­లు నవం­బ­ర్ 10, 11 తే­దీ­ల్లో ఒక కీలక సమా­వే­శం ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఈ సమా­వే­శం­లో ప్ర­ధా­నం­గా రా­బో­యే వే­లా­ని­కి ముం­దు ఏయే ఆట­గా­ళ్ల­ను రి­టై­న్ చే­సు­కో­వా­లి, ఎవ­రి­ని రి­లీ­జ్ చే­యా­ల­నే దా­ని­పై చర్చ జర­గ­నుం­ది. అం­తే­కా­కుం­డా, సంజు శాం­స­న్ ట్రే­డ్ డీ­ల్‌­పై కూడా సమా­వే­శం­లో చర్చిం­చే అవ­కా­శం ఉంది. ఐపీ­ఎ­ల్ 2026 మినీ వే­లా­ని­కి ముం­దు చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ రి­టై­న్ చే­సు­కు­నే ఆట­గా­ళ్ల­పై దృ­ష్టి పె­ట్టిం­ది. రి­టై­న్ చే­సు­కు­నే ఆట­గా­ళ్ల జా­బి­తా­ను చర్చిం­చ­డా­ని­కి త్వ­ర­లో మహేం­ద్ర సిం­గ్ ధో­నీ­తో ప్ర­స్తుత కె­ప్టె­న్ రు­తు­రా­జ్ గై­క్వా­డ్, కోచ్ స్టీ­ఫె­న్ ఫ్లె­మిం­గ్ త్వ­ర­లో సమా­వే­శం కా­ను­న్నా­రు. రి­టై­న్ చే­సు­కు­నే ఆట­గా­ళ్ల­పై ఈ ము­గ్గు­రూ చర్చిం­చ­నుం­డ­గా.. తుది ని­ర్ణ­యం చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ క్రి­కె­ట్ లి­మి­టె­డ్ (CSKCL) చై­ర్మ­న్‌­గా ని­య­మి­తు­లైన శ్రీ­ని­వా­స­న్ తీ­సు­కుం­టా­రు. ఐపీ­ఎ­ల్ 2025లో చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఘో­రం­గా వి­ఫ­ల­మైన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ సీ­జ­న్ లో తొలి మ్యా­చ్ గె­లి­చి శు­భా­రం­భం చే­సిన చె­న్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యా­చ్ ల్లో 8 మ్యా­చ్ ల్లో ఓడి­పో­యిం­ది. ఈ సీ­జ­న్‌­లో సత్తా చా­టా­ల­ని చూ­స్తోం­ది.

Tags

Next Story