DHONI: మహేంద్రుడిలో మరో కోణం!

మహేంద్రసింగ్ ధోనీ.. టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్. సారధిగా ధోనీని మించిన ప్లేయర్ లేడంటే అతిశయోక్తి కాదు. భారత్‌కు వన్డే ప్రపంచకప్, టీ 20 ప్రపంచకప్ అందించి టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌గా నిలిపిన కెప్టెన్. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన సారధిగా ధోనీ క్రికెట్ ప్రపంచంలో ఎనలేని ఖ్యాతిని ఆర్జించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు అయిదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. అయితే ఇటీవల ధోనీపై వరుసగా విమర్శలు వస్తున్నాయి. మాజీ ఆటగాళ్లు ధోనీపై చేస్తున్న విమర్శలు... క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి.
హుక్కా తాగడం వల్లే..
తన కెరీర్ పతనం వెనుక ధోనీ హస్తం ఉందని ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. పఠాన్ ధోనీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించే అన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. “ఎవరి గదిలోనో హుక్కా ఏర్పాటు చేయడం, దాని గురించి మాట్లాడటం నాకు అలవాటు లేదు. ఈ విషయం అందరికీ తెలుసు.” అని అన్నారు. హుక్కా తాగలేదనే ఉద్దేశంతో పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ధోనీని లక్ష్యంగా చేసుకుని చేసినట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో ధోనీ హుక్కా తాగుతున్న వీడియోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జార్జ్ బెయిలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ధోనీ సహచర ఆటగాళ్లతో అప్పుడప్పుడు హుక్కా తాగుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో, హుక్కా తాగే ఆటగాళ్లకే ధోనీ జట్టులో ప్రాధాన్యత ఇచ్చేవారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యల వల్ల ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ అద్భుతంగా ఉన్న సమయంలోనే ముగిసిపోయిందని, మంచి ప్రదర్శన చేసినా జట్టులో చోటు దక్కలేదని అభిమానులు అంటున్నారు.
ధోనీపై సెహ్వాగ్ కామెంట్స్
2011 వన్డే ప్రపంచకప్‌నకు ముందు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని సెహ్వాగ్ భావించాడు. అందుకు కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని తాజాగా సెహ్వాగ్ తెలిపాడు. 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో తాను విఫలమైనప్పుడు ధోనీ తనను పక్కన పెట్టాడని సెహ్వాగ్ తెలిపాడు. ధోనీ తనను తుది జట్టు నుంచి తొలగించడంతో సెహ్వాగ్ రిటైర్ అవ్వాలని భావించాడట.
ధోనీ నన్ను తిట్టాడు
ధోని తనను తిట్టాడని బౌలర్ మోహిత్ శర్మ ఇటీవల తెలిపాడు. ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌లో ధోనీ కోపంతో తనను తిట్టాడని తెలిపాడు. అయితే ధోనీతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని మోహిత్ వివరించాడు. యువరాజ్ సింగ్, క్రికెట్ లెజెండ్ కాకుండా రిటైర్మెంట్ తీసుకోవడానికి ధోనీయే కారణమని చాలా సార్లు ఆరోపించాడు యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్.. మాహీపై ఆరోపణలు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com