DHONI: ధోనీ నా కెరీర్ నాశనం చేశాడు

DHONI: ధోనీ నా కెరీర్ నాశనం చేశాడు
X
తొలిసారి ధోనీపై తీవ్ర విమర్శలు... ఇప్పటికే ధోనీపై సెహ్వాగ్ ఆరోపణలు... తాజాగా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు

భారత క్రి­కె­ట్ జట్టు మాజీ ఆల్‌­రౌం­డ­ర్ ఇర్ఫా­న్ పఠా­న్ తన అం­త­ర్జా­తీయ కె­రీ­ర్‌­కు సం­బం­ధిం­చి కొ­న్ని సం­చ­లన వి­ష­యా­ల­ను బయ­ట­పె­ట్టా­డు. ఒక­ప్పు­డు జట్టు­లో కీలక ఆట­గా­డి­గా వె­లు­గొం­దిన తాను 2009లో ఉన్న­ట్టుం­డి జట్టు­కు ఎలా దూ­ర­మ­య్యా­డో, ఆ ని­ర్ణ­యం వె­నుక ఎవ­రు­న్నా­రో తా­జా­గా వె­ల్ల­డిం­చా­డు. అప్ప­టి కె­ప్టె­న్ మహేం­ద్ర సిం­గ్ ధోనీ వల్లే తనను పక్క­న­పె­ట్టా­ర­ని పరో­క్షం­గా ఆరో­పిం­చా­డు. రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చిన ఐదే­ళ్ల తర్వాత ఈ వి­ష­యా­న్ని వె­ల్ల­డిం­చా­డు. ధోనీ కా­ర­ణం­గా­నే తన కె­రీ­ర్ నా­శ­న­మైం­ద­ని మాజీ ఆల్‌­రౌం­డ­ర్ ఇర్ఫా­న్ పఠా­న్ తె­లి­పా­డు. మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­సి­నా జట్టు నుం­చి తప్పిం­చా­డ­ని ఆరో­పిం­చా­డు. జట్టు­లో ప్ర­ధాన పే­స­ర్‌­గా.. పేస్ ఆల్‌­రౌం­డ­ర్‌­గా వె­లు­గొం­దిన ఇర్ఫా­న్ పఠా­న్ 2009లో ఉన్న­ట్టుం­డి జట్టు­కు దూ­ర­మ­య్యా­డు. భా­ర­త్ తర­ఫున చి­వ­రి మ్యా­చ్‌­ను ఇర్ఫా­న్ పఠా­న్ 2012 అక్టో­బ­ర్‌­లో ఆడా­డు. ఆ తర్వాత మళ్లీ జట్టు­లో­కి రా­లే­క­పో­యిన అతను.. 2020లో రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చా­డు. ఇర్ఫా­న్ పఠా­న్ ధో­నీ­పై సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­య­డం కల­క­లం రే­పు­తోం­ది.

ఇప్పటికే సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

మహేం­ద్ర సిం­గ్ ధోనీ కె­ప్టె­న్‌­గా మా­రిన తర్వాత గం­గూ­లీ కె­ప్టె­న్సీ­లో ఆడిన సీ­ని­య­ర్ ప్లే­య­ర్ల­ను సైడ్ చే­య­డం మొ­ద­లె­ట్టా­డు. సచి­న్ టెం­డూ­ల్క­ర్ మి­న­హా­యి­స్తే, మి­గి­లిన సీ­ని­య­ర్ ప్లే­య­ర్లు అం­ద­రూ కూడా కె­రీ­ర్‌­కి సరైన వీ­డ్కో­లు లే­కుం­డా­నే క్రి­కె­ట్‌­కి రి­టై­ర్మెం­ట్ ఇవ్వా­ల్సి వచ్చిం­ది. 2013లో అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ నుం­చి తప్పు­కు­న్న వీ­రేం­ద్ర సె­హ్వా­గ్, 2007లోనే రి­టై­ర్మెం­ట్ తీ­సు­కో­వా­ల­ని అను­కు­న్నా­డట.. ‘‘2007-08 ఆస్ట్రే­లి­యా­లో వన్డే మ్యా­చు­లు ఆడాం. అం­దు­లో నేను మొ­ద­టి మూడు మ్యా­చు­లు ఆడా­ను. ఆ తర్వాత నన్ను, టీమ్ నుం­చి తప్పిం­చా­రు. ఆ తర్వాత నన్ను, తుది జట్టు­లో­కి తీ­సు­కో­వ­డ­మే మా­నే­శా­రు. ఇక నేను, టీ­మ్‌­లో­కి రా­లే­నే­మో­న­ని అని­పిం­చిం­ది. వన్డే క్రి­కె­ట్‌­కి రి­టై­ర్మెం­ట్ ఇచ్చి, తప్పు­కో­వ­డ­మే బె­ట­ర్ అని అను­కు­న్నా­ను..

నా ని­ర్ణ­యా­న్ని, తొ­లుత సచి­న్ టెం­డూ­ల్క­ర్‌­కి చె­ప్పా­ను. వన్డేల నుం­చి తప్పు­కో­వా­ల­ని అను­కుం­టు­న్న­ట్టు­గా చె­ప్పా­ను. దా­ని­కి ఆయన, ‘వద్దు, అలా చే­య­కు.. 1999-2000 సమ­యం­లో నేను కూడా ఇలాం­టి పరి­స్థి­తి­ని ఫేస్ చే­శా­ను. క్రి­కె­ట్ మా­నే­యా­ల­ని అని­పిం­చిం­ది. అయి­తే కె­రీ­ర్‌­లో ఇలాం­టి ఫే­జ్‌­లు వస్తుం­టా­యి, పో­తుం­టా­యి. ఇప్పు­డు నీ వి­ష­యం­లో అదే జరు­గు­తోం­ది. ఇది పో­తుం­ది. తొం­ద­ర­ప­డి, ఏ ని­ర్ణ­యా­లు తీ­సు­కో­కు.. నీకు, ను­వ్వు కొంత సమయం ఇవ్వు.. ఇంకో ఒకటి, రెం­డు సి­రీ­స్‌­లు చూడు..’ అని చె­ప్పా­రు. ఆ తర్వా­తి సి­రీ­స్‌­లో నేను ఆడా­డు, బాగా పరు­గు­లు చే­శా­ను.. అని సె­హ్వా­గ్ అన్నా­డు. 2011 వన్డే వర­ల్డ్ కప్‌­కి ఎం­పి­క­య్యా­ను, మేం వర­ల్డ్ కప్ కూడా గె­లి­చాం అని సె­హ్వా­గ్ అన్నా­డు.

Tags

Next Story