Dhoni IPL Retirement : ధోని ఐపీఎల్ కెరీర్ ముగియనుందా...!?

ఐపీఎల్-2023 సీజన్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కెరీర్ ముగియనుందా...! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రచారం జోరందుకుంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి 10 జట్లు టోర్నీల్లో పోటీపడబోతున్నాయి. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో చెపాక్‌లోనే ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌కి గుడ్ బై చెప్పేస్తాడని ప్రచారం జరుగుతోంది.
2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేసిన మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్ 2022 సీజన్‌తో ఐపీఎల్ కెరీర్ కూడా ముగించాలని భావించాడు. ఈ మేరకు రవీంద్ర జడేజాని గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కానీ చెన్నై టీమ్ వరుస ఓటములతో ఒత్తిడికి గురైన జడేజా సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ధోనీ చేతికి మళ్లీ చెన్నై టీమ్ పగ్గాలు వెళ్లాయి. ఈ ఏడాది కూడా ధోనీనే కెప్టెన్‌గా చెన్నై టీమ్‌ని నడిపించబోతున్నాడు.
2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ధోనీ ఇప్పటి వరకూ 234 మ్యాచ్‌లాడి 135.2 స్ట్రైక్‌రేట్‌తో 4,978 పరుగులు చేశాడు. చెన్నై టీమ్‌ని 2010, 2011, 2018, 2021లో ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ధోనీ తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com