ధోనీ క్రికెటరే కాదు.. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్.. ఏడాదికి 1040 కోట్లు

క్రికెట్ కెరియర్‌లో అనేక రికార్డులను నమోదు చేసిన ధోని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గ్రౌండ్‌లోనే కాదు, బయట కూడా తగ్గేదేలే అంటూ పర్‌ఫెక్ట్ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు. ఈ మాజీ కెప్టెన్ కూల్ ఫేమస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో పలు రంగాల్లో పెట్టుబడులతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు వేయి నలభై కోట్లు. ఆయన వార్షిక వేతనం 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఐపీఎల్ టీం సీఎస్‌కే ద్వారా 12 కోట్ల ఆదాయం వస్తోంది. గత పదహారు సీజన్‌లలో ఐపీఎల్ ద్వారా 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఖాతా బుక్,కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటిసంస్థల్లో ధోని ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా ఫిట్‌నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్‌లో మెజారిటీ వాటాలు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్‌లు, స్పోర్ట్స్ వేర్, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది భారీగా ఆదాయం వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com